హెల్త్ టిప్స్

పురుషుల్లో అధికంగా పెరిగే ఛాతిని త‌గ్గించుకోవాలంటే ఇలా చేయాలి..!

నేటి త‌రుణంలో చాలా మంది మ‌గ‌వారు ఇబ్బంది పడుతున్న స‌మ‌స్య‌లో ఛాతి స‌మ‌స్య కూడా ఒక‌టి. ఆడ‌వారి లాగా రొమ్ములు ఉండ‌డం, ఎక్కువ‌గా ఛాతీ పెర‌గ‌డం వీటిలో ప్ర‌ధాన‌మైన‌వి. అయితే వీటిని దూరం చేసుకోవ‌డానికి ఎక్క‌డికీ వెళ్లాల్సిన ప‌నిలేదు. ఎలాంటి సర్జ‌రీలు అవ‌స‌రం లేదు. ఇంట్లోనే ఛాతి స‌మ‌స్య‌ను మాయం చేసుకోవ‌చ్చు. అందుకు ప‌లు సూచ‌న‌లు పాటిస్తే చాలు. అవేమిటో ఇప్పుడు చూద్దామా. వెయిట్ లిఫ్టింగ్‌, స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ వంటి ఎక్స‌ర్‌సైజ్‌ల‌ను చేస్తే చాలు. అధిక ఛాతి స‌మ‌స్య నుంచి ఇట్టే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పొట్ట‌, ఛాతి, వీపు కండ‌రాల‌ను ప‌టిష్టం చేయ‌డంలో పుష‌ప్స్ ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. క‌నుక వీటిని క్ర‌మం త‌ప్ప‌కుండా రోజూ చేస్తే చాలు. దాంతో ఛాతి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఛాతి మీద నుంచి బ‌రువు తీసుకు వెళ్లేట్టుగా ఉండే ప్రెస్ ఎక్స‌ర్‌సైజ్‌లు చేయాలి. ఇందులో చెస్ట్ ప్రెస్‌, బెంచ్ ప్రెస్‌, స్వ్కీజ్ ప్రెస్‌, ఇన్‌క్లైన్ ప్రెస్‌, డిక్లైన్ ప్రెస్ వంటి వివిధ ర‌కాల ఎక్స‌ర్‌సైజ్‌లు ఉన్నాయి. వాటిలో దేన్నయినా ట్రై చేయ‌వ‌చ్చు. అలా చేస్తే అధిక ఛాతి ఇట్టే తొల‌గిపోతుంది. డంబుల్ ఎత్త‌డం, ఫ్లై ఎక్స‌ర్‌సైజ్‌లు వంటివి చేసినా ఛాతిని త‌గ్గించుకోవ‌చ్చు. ఇందులో ఉండే ఇన్‌క్లైన్ ఫ్లైస్‌, డిక్లైన్ ఫ్లైస్‌, కేబుల్ ఫ్లైస్ అనే ఎక్స‌ర్‌సైజ్‌ల‌ను 3,4 వారాల‌కోసారి మారుస్తూ చేస్తే ఫ‌లితం ఉంటుంది. నిత్యం కూర్చుని ప‌ని చేసే వారు లిఫ్ట్ కాకుండా మెట్లు ఎక్క‌డం, బైక్ కాకుండా సైకిల్ తొక్క‌డం వంటి శారీర‌క శ్ర‌మ క‌లిగిన ప‌నులు చేస్తే దాంతో కూడా అధిక ఛాతి త‌గ్గుతుంది.

how to remove chest fat in men follow these tips

వారంలో క‌నీసం 5 నుంచి 6 సార్లు గుండెకు మంచి వ్యాయామం జ‌రిగేలా కార్డియో వ‌ర్క‌వుట్ చేయాలి. దీంతో ఛాతి త‌గ్గుతుంది. వాకింగ్‌, జాగింగ్‌, ర‌న్నింగ్‌, స్విమ్మింగ్ వంటి వ్యాయామాల్లో దేన్న‌యినా చేస్తే కార్డియో వ‌ర్క‌వుట్ అవుతుంది. వారంలో క‌నీసం 3 నుంచి 4 సార్లు యోగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా అధికంగా పెరిగిన ఛాతిని త‌గ్గించుకోవ‌చ్చు. అధిక ఛాతి స‌మ‌స్య‌తో బాధ ప‌డే మ‌గ‌వారు పాటించాల్సిన ఇంకో టిప్ ఏమిటంటే… నిద్ర‌. రోజుకు ఎంత లేద‌న్నా క‌నీసం 8 నుంచి 9 గంట‌ల నిద్ర పోతే దాంతో ఆటోమేటిక్‌గా కండ‌రాలు బిల్డ్ అవుతాయి. అప్పుడు ఛాతి త‌గ్గుతుంది. రోజుకు 1200 క్యాల‌రీల‌కు మించ‌కుండా ఆహారం తీసుకోవాలి. దీంతో శ‌రీరంలో అధికంగా ఉన్న బ‌రువే కాదు, చాతి కూడా త‌గ్గుతుంది. కొవ్వు క‌రుగుతుంది.

పిజ్జాలు, బ‌ర్గ‌ర్లు, బిర్యానీలు ఇత‌ర హై క్యాల‌రీల‌ను ఇచ్చే జంక్ ఫుడ్ అంత‌టినీ మానేయాలి. వాటిని అస్స‌లు తిన‌కూడ‌దు. తింటే కొవ్వు పెరిగి స‌మ‌స్య పున‌రావృతం అవుతుంది. ఇక చివ‌రిగా నీరు తాగ‌డం. రోజుకు క‌నీసం 3 లీట‌ర్ల నీటిని తాగితే దాంతో శ‌రీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల క్యాల‌రీలు క‌రుగుతాయి. కొవ్వు త‌గ్గి చాతి కూడా పోతుంది.

Admin

Recent Posts