వినోదం

ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు ఎందుకు తీయ‌డం లేదు..?

అయ్యో ఈ దర్శకుడు ఇంకొన్ని సినిమాలు తీసుంటే ఇంకా బాగుండేది కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ అనిపించి ఉంటే ఏ దర్శకుల గురించి అలా అనుకున్నారు? ఎందుకు? అంటే.. డైరెక్టర్ అనగానే నాకు మొదటగా గుర్తుకు వచ్చే పేరు ఎస్. వి. కృష్ణ రెడ్డి. ఎంతోబాగుంటాయి ఆయన సినిమాలు… ఇంటిల్లిపాది ఆహ్లాదకరంగా చూడగలిగే చక్కని సినిమాలు ఆయనవి. 90’s కిడ్స్ అంతా దాదాపు ఆయన సినిమాలు చూసే పెరిగాము. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని ఈస్ట్ గోదావరి జిల్లాలో 1 జూన్ 1961 లో జన్మించారు. ఆయన డైరెక్టర్ గారంగప్రవేశం చేసిన చిత్రం మాయలోడు. డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా యాక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, కంపోజర్‌గా సక్సెస్ అయ్యారు.

నా వరకు అయితే ఆయన సినిమాలు ఎన్ని సార్లు చూసిన బోర్ అనిపించవు. తెలుగు నటుడు అలీ అంతటి వారే గురువు గారూ అని గౌరవం తో నమస్కరం చేస్తారు. ఆయన తీసిన కొన్ని అద్భుతమైన సినిమాలు.. యమలీల, శుభలగ్నం, అభిషేకం, ఆహ్వానం, రాజేంద్రుడు గజేంద్రుడు, ఊయల, టాప్ హీరో, మావిచిగురు, ఎగిరే పావురమా, ప్రేమకు స్వాగతం, అతడే ఒకసైన్యం, సర్దుకుపోదాం రండి, పెళ్ళాం వూరెళితే, సుమంగళి, పెళ్లి పీటలు… ఇవేనండి నాకు బాగా నచ్చిన సినిమాలు.

why sv krishna reddy stopped doing movies

ఈమధ్య ఎస్.వి. కృష్ణారెడ్డి గారు ఒక టీవీ షో లో కనిపిస్తే చూసాను. చాలా సింపుల్ గ ఉన్నారు. ఒక్క మాటలో నిగర్వి అని చెప్పచ్చు. కొందరు తెలుగు హీరోలకి హిట్స్ తెచ్చి పెట్టిన సినిమాలు ఈయనకే సాధ్యం. జీవితంలో ఎప్పడైనా నాకు ఎదురుపడితే మీరు ఎందుకు సినిమాలు ఆపేసారు అని కచ్చితంగా అడుగుతాను. చాలా మిస్ అవుతున్నాం ఆయన సినిమాలు… ఆయ‌న చివ‌రి సినిమా య‌మ‌లీల 2 ఫ్లాప్ అయింది. బ‌హుశా అందుకేనేమో ఆయ‌న‌కు ఎవ‌రూ చాన్స్ ఇవ్వ‌డం లేదు.

Admin

Recent Posts