ప్రకటనలలో చూసే సిక్స్ ప్యాక్ పొట్ట కోరుతున్నారా? ఈ సింపుల్ వ్యాయామాలు చేసి బాన పొట్టను కరిగించి స్మార్ట్ అనిపించేసుకోండి! ప్రత్యేకించి పొట్టకు మాత్రమే – నేలపై వెల్లకిలా పడుకోండి మోకాళ్లు పొట్టవైపు బాగా వంచండి. చేతులు తలకింద పెట్టండి. మీ భుజాలను నేలపై నుండి లేపుతూ మరోవైపు మీ కాళ్ళను పొట్టకు ప్రెస్ చేస్తూ వుండుండి. మెల్లగా నార్మల్ పొజిషన్ కు రండి. మరల పై విధంగా చేయండి. ఈ వ్యాయామాలు ప్రతిరోజూ 10 నుండి 12 సార్లు చేయండి.
రివర్స్ వ్యాయామం – నేలపై వెల్లకిలా పడుకోండి. కాళ్ళను, మోకాళ్ళను 90 డిగ్రీలలో పైకి లేపండి. పొట్టను బాగా లోపలికి లాగండి. ఇపుడు మోకాళ్ళను వంచి పిరుదులు, మోకాళ్ళు మీ ఛాతీవైపుకు ప్రెస్ చేయండి. మెల్లగా నార్మల్ పొజిషన్ కు రండి. మరల పై విధంగా చేయండి. ఈ వ్యాయామం ప్రతిరోజూ 10 నుండి 12 సార్లు క్రమం తప్పకుండా చేయండి.
కత్తెర వ్యాయామం – వెల్లకిలా పడుకోండి చేతులు తలకింద వుంచి కాళ్ళు పైకి ఎత్తండి. పొట్టను లోపలికి లాగుతూ భుజాలు నేలపైనుండి పైకి లేపండి. ఎడమ భుజం కూడి మోకాలికి, కుడి భుజం ఎడమ మోకాలికి తగిలించండి. ఈ రకంగా 10 నుండి 12 సార్లు ప్రతిరోజూ చేయండి. ఈ మూడు వ్యాయామాలు రెగ్యులర్ గా చేస్తూవుంటే, మీ పొట్ట కొవ్వు తగ్గి గణనీయమైన మార్పును మీ శారీరక ఫిట్ నెస్ లో గమనిస్తారు.