వ్యాయామం

రోజూ వ్యాయామం చేస్తే మెద‌డుపై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుందో తెలుసా..?

ప్రతిరోజూ వ్యాయామం చేస్తే కండరాల బలోపేతం, వివిధ ఆకృతులలో శరీరాలు భాగాలు మారుతాయని అందరిలో ఉన్న భావన వాస్తవం అయినా.. మనం చేసే వ్యాయామంతో మెదడుకూ ఎంతో మేలవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ భంగిమలతో వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం పెరిగి మెదడుకు అధిక మోతాదులో ఆక్సిజన్, రక్తం సరఫరా అవుతాయి. మెదడు కణాలు ఎదిగేందుకు అవసరమయ్యే హార్మోన్లు వ్యాయామం చేసేటప్పుడు విడుదలవుతాయి. వీటితో పాటు మెదడుకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.

వ్యాయామంతో ఏకగ్రాత పెరుగుతుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా వ్యాయామం చేసేవారిలో ఏకాగ్రత సామ‌ర్థ్యాన్ని తెలిపే ఇండివిడ్యువల్‌ అల్ఫా పీక్‌ ఫ్రీక్వెన్సీ మెరుగుపడుతుంని అధ్యాయనాలు చెబుతున్నాయి. జాగింగ్ వామ‌ప్‌ల వంటి వ్యాయామాలు చేసినప్పుడు మెదడులోని హిప్పోక్యాంపస్‌ అనే భాగం వృద్ధి చెందడంతో గుండె, శ్వాసవేగం పెరుగుతాయి. వయస్సు పెరిగే కొద్ది తరగకుండా చేసే వ్యాయామమే కాపాడుతుంది.

what happens to your brain if you do exercise daily

డిప్రెషన్, ఆందోళన తగ్గడానికి వంటి లక్షణాలు తగ్గడానికి ఏరోబిక్‌ వ్యాయామాలు ఎంతో తోడ్ప‌డుతాయి. అందుకే వ్యాయామం ఒక అలవాటుగా చేసుకోవాలని వైద్యులు పదేపదే సూచిస్తారు. కొత్త విషయాలు నేర్చుకునే సమయంలో మెదడు అందుకు అనుగునంగా మారుతుంది. ఈ సామర్థ్యం వృద్ధి చెందేందుకు వ్యాయామం ఎంతో అవసరం. ఇది చిన్నవారిలో ఎక్కువ. ఏరోబిక్‌ కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు ఏవైనా ఇందుకు తోడ్పాటు అందిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వారానికి 5 రోజులు 40–60 నిమిషాల వ్యాయామం చేస్తే మెదడుకు ఎంతో మేలని అ«ధ్యయనాలు చెబుతున్నాయి.

Admin

Recent Posts