మీరు వాడుతున్న తేనె అస‌లైందేనా..? క‌ల్తీ జ‌రిగిందా..? ఇలా సుల‌భంగా తెలుసుకోండి..!

తేనె వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని నిత్యం వాడ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జీర్ణ స‌మస్య‌లు ఉండ‌వు. ఇంకా అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే మార్కెట్‌లో మ‌న‌కు ల‌భించే తేనెల్లో అనేకమైన తేనెలు క‌ల్తీవే ఉంటున్నాయి. ఈ క్ర‌మంలో స్వ‌చ్ఛ‌మైన తేనె ల‌భించ‌డం క‌ష్టంగా మారింది. అయితే ఎవ‌రైనా స‌రే.. తాము కొన్న తేనె స్వ‌చ్ఛ‌మైందో, న‌కిలీలో ఇలా సుల‌భంగా క‌నిపెట్టేయ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే…

8 ways to identify that your honey is adulterated or not 8 ways to identify that your honey is adulterated or not

* వేలిపై చిన్న తేనె చుక్క‌ను వేసి చూడండి. న‌కిలీ తేనె అయితే సుల‌భంగా అటు, ఇటు నీళ్లు వెళ్లిన‌ట్లు వెళ్తుంది. అదే స్వ‌చ్ఛ‌మైన తేనె అయితే ఆ చుక్క క‌ద‌ల‌కుండా అలాగే ఉంటుంది. ఇలా న‌కిలీ తేనెను క‌నిపెట్ట‌వ‌చ్చు.

* ఒక టీస్పూన్ తేనెను ఒక గ్లాస్ నీటిలో వేసి చూడండి. తేనె త్వ‌ర‌గా కరిగిపోతే అది న‌కిలీద‌ని గుర్తించండి. స్వ‌చ్ఛ‌మైన తేనెను నీటిలో వేయ‌గానే గ్లాస్ అడుగు భాగంలోకి చేరి కొంత సేపు వ‌ర‌కు అలాగే ఉంటుంది. ఇలా స్వ‌చ్ఛ‌మైన తేనెను గుర్తించ‌వ‌చ్చు.

* బ్లోటింగ్ పేప‌ర్ లేదా తెలుపు రంగు వ‌స్త్రంపై చిన్న తేనె చుక్క‌ను వేసి చూడండి. స్వ‌చ్ఛ‌మైన తేనె అయితే ఆ వ‌స్తువులు తేనెను లోపలికి పీల్చుకోవు. అలాగే మ‌ర‌క‌లు కూడా ప‌డ‌వు. న‌కిలీ తేనె అయితే సుల‌భంగా మ‌ర‌క‌లు ప‌డ‌తాయి. లోప‌లికి పీల్చుకోబ‌డుతుంది.

* స్వ‌చ్ఛ‌మైన తేనె మండుతుంది. అంటే.. మండే స్వభావాన్ని క‌లిగి ఉంటుంది. ఒక అగ్గిపుల్ల‌ను తేనెలో ముంచి దాన్ని పెట్టెకు రాపిడి క‌లిగించాలి. స్వ‌చ్ఛ‌మైన తేనె అయితే అగ్గిపుల్ల మండుతుంది. అదే క‌ల్తీ అయిన తేనె అయితే అగ్గిపుల్ల మండ‌దు. ఈ సూచను పాటించేట‌ప్పుడు మంట‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి.

* ఒక టేబుల్ స్పూన్ తేనె, కొద్దిగా నీళ్లు, 2-3 చుక్క‌ల వెనిగ‌ర్ క‌లిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంలో నుర‌గ వ‌స్తే అప్పుడు ఆ తేనె క‌ల్తీ అయిన‌ట్లు గుర్తించాలి.

* కొద్దిగా తేనెను తీసుకుని పాన్‌పై వేసి వేడిచేయాలి. అందులో నుంచి నుర‌గ వ‌స్తుంటే అది న‌కిలీ తేనె అని గుర్తించాలి.

* స్వ‌చ్ఛ‌మైన తేనె మృదువుగా అనిపిస్తుంది. పొర‌లుగా విడిపోదు. తియ్య‌ని వాస‌న వ‌స్తుంది. స్వ‌చ్ఛ‌మైన తేనెను తిన్న‌ప్పుడు గొంతులో మండిన‌ట్లు కూడా అనిపిస్తుంది. ఈ విధంగా తేనె క‌ల్తీ అయిందో, లేదో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

 

Admin

Recent Posts