మనలో అధిక శాతం మంది నిత్యం ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయరు. నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తారు. అయితే నిజానికి ఇలా చేయరాదు. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్‌ను చేయాల్సి ఉంటుంది. ఇక కొందరు బరువు తగ్గవచ్చని చెప్పి బ్రేక్‌ఫాస్ట్ చేయడం మానేస్తారు. అలా కూడా చేయరాదు. ఈ క్రమంలోనే బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం వల్ల మనకు ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయడం వల్ల మెదడు పనితీరు తగ్గుతుంది. చురుగ్గా ఉండలేరు. రాత్రంతా శరీరానికి ఆహారం లేకుండా ఉంటుంది కనుక ఉదయాన్నే కచ్చితంగా ఏదో ఒకటి తినాలి. దీంతో శరీరానికి శక్తి లభించడమే కాదు, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. లేదంటే మెదడు పనితీరు మందగిస్తుంది. ఆలోచనా శక్తి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి అన్నీ తగ్గుతాయి. ఈ వివరాలను సైంటిస్టులు వెల్లడించారు.
2. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం వల్ల డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అస్తవ్యస్తమైన జీవన విధానానికి అది మొదటి అడుగు. కనుక డయాబెటిస్ వస్తుంది. దాన్ని నివారించాలంటే నిత్యం బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది. మానేయరాదు.
3. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే రోజులో మిగిలిన సమయంలో అధిక మొత్తంలో ఆహారం తీసుకుంటారని, దీంతో సాధారణం కన్నా కాస్త ఎక్కువగానే ఆహారం తీసుకుంటారని, దీని వల్ల అధిక బరువు పెరుగుతారని సైంటిస్టులు తేల్చారు. కాబట్టి బరువు పెరగకుండా ఉండాలంటే నిత్యం బ్రేక్‌ఫాస్ట్ ను చేయాల్సి ఉంటుంది.
4. బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే శరీర మెటబాలిజం తగ్గుతుంది. దీని వల్ల క్యాలరీలు సరిగ్గా ఖర్చు కావు. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల అధిక బరువు పెరగడంతోపాటు గుండె జబ్బులు, డయాబెటిస్ వస్తాయి.
5. బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి తరచూ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
6. బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.
7. ఉదయం అల్పాహారం తీసుకోకపోతే మైగ్రేన్ వస్తుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
8. బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల గుండె పనితీరు మందగిస్తుంది. హైబీపీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. స్త్రీలలో రుతు సమయంలో సమస్యలు ఎక్కువగా వస్తాయి. లేదా నెలసరి సరిగ్గా రాదు.