Categories: Featured

ఏ రంగులో ఉన్న ఆహారాలను తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?

ప్రకృతిలో మనకు అనేక రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఇతర ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ ఆహారాన్ని తీసుకున్నా.. అది ఏదో ఒక రంగులో కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలోనే నిర్దిష్టమైన రంగులు కలిగిన ఆహారాలను మనం తింటే.. వాటి వల్ల మనకు పలు ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

different types of color foods and their health benefits

* గుండె జబ్బులు, తలనొప్పి, క్యాన్సర్‌, బీపీ, అల్సర్లు, ఫ్లూ వంటి సమస్యలు ఉన్నవారు, మానసిక సమస్యలు ఉన్నవారు ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలు, పండ్లు, ఆహారాలను తినాలి. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

* నీలం రంగులో ఉండే ఆహారాలను తినడం వల్ల అల్సర్లు, వాపులు, వెన్నెముక వ్యాధులు, టైఫాయిడ్‌, విష జ్వరాలు, పచ్చలు, అమ్మవారు, నిద్రలేమి, లోబీపీ, బరువు తగ్గడం, రుతు క్రమం సరిగ్గా ఉండకపోవడం.. వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.

* ఎరుపు రంగులో ఉండే ఆహారాలను తింటే చర్మవ్యాధులు, రక్తహీనత, మూత్ర కోశ వ్యాధులు, రక్తదోషాలు, జలుబు, పక్షవాతం, బట్టతల వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.

* నారింజ రంగులో ఉండే ఆహారాలను తింటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మూర్ఛ, కలరా, శ్లేషమ్మ సంబంధ జ్వరాలు, మూత్రపిండాల వాపులు తదితర సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.

* పింక్‌ రంగులో ఉండే ఆహారాలను తినడం వల్ల కండరాలకు ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. లివర్‌ వ్యాధులు తగ్గుతాయి.

* జీర్ణాశయం సమస్యలను పోగొట్టడంలో పసుపు పచ్చ రంగు ఉన్న ఆహారాలు బాగా పనిచేస్తాయి. మలబద్దకం తగ్గుతుంది. ఒత్తిడి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

* ఇండిగో కలర్‌లో ఉండే ఆహారాలను తినడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. ఊపిరితిత్తుల వ్యాధులు, చెవుడు, చిన్నపిల్లలకు వచ్చే ఫిట్స్‌ వంటి సమస్యలు తగ్గుతాయి.

* ఊదా రంగులో ఉండే ఆహారాలను తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మూత్ర పిండాలు, మూత్ర కోశ సమస్యలు ఉండవు. మైగ్రేన్‌ సమస్య కూడా తగ్గుతుంది.

Share
Admin

Recent Posts