Reading : చిన్నతనంలో ఉన్నప్పుడు స్కూల్, తరువాత కాలేజీ.. అక్కడి వరకు బాగానే ఉంటుంది. కానీ కాలేజ్ ముగిశాక ఉద్యోగం సంపాదిస్తే.. ఎవరైనా సరే చదవడం మానేస్తారు. స్కూల్, కాలేజీ స్థాయిల్లో పాఠ్యాంశాలను రోజూ చదువుతుంటారు. కనుక మెదడు పదునుగా మారుతుంది. ఆలోచనా శక్తి, సృజనాత్మకత పెరుగుతాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెండుగా ఉంటాయి. కానీ విద్యాభ్యాసం ముగిసి ఏదైనా ఉద్యోగం చేస్తుంటే.. కొన్నాళ్లకు మెదడు నిస్తేజంగా మారుతుంది. అవును.. ఇదే విషయాన్ని న్యూరో సైన్స్ నిపుణులు చెబుతున్నారు.
రోజూ మనం కనీసం 30 నిమిషాల పాటు దేన్నయినా సరే చదవాలని వారు సూచిస్తున్నారు. మనం నాలెడ్జ్‌ని పెంచుకోవాల్సిన పనిలేదు. రోజూ పత్రికల్లో వచ్చే వార్తలు లేదా ఇతర పుస్తకాలు ఏవైనా సరే.. కనీసం 30 నిమిషాల పాటు చదవాలని వారు సూచిస్తున్నారు. దీంతో మెదడు తిరిగి యాక్టివేట్ అవుతుందని అంటున్నారు. ఈ క్రమంలో మెదడు చురుగ్గా పనిచేస్తుందని చెబుతున్నారు.
రోజూ కనీసం 30 నిమిషాల పాటు దేన్నయినా సరే చదవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఆలోచనా శక్తి పెరుగుతుంది. వృద్ధాప్యంలో అల్జీమర్స్ రాకుండా చూసుకోవచ్చు. ఈ విధంగా ఎన్నో లాభాలు కలుగుతాయి.
చిన్నతనం నుంచి కాలేజీ దశ వరకు రోజూ పాఠ్యాంశాలను చదువుతుంటాము కనుక మెదడు చురుగ్గానే ఉంటుంది. కానీ ఆ తరువాత విద్యాభ్యాసం ఆపేస్తాం.. కనుక మెదడు యాక్టివ్ నెస్ తగ్గుతుంది. కనుక దాన్ని మళ్లీ పెంచుకోవాలంటే రోజూ కనీసం 30 నిమిషాల పాటు దేన్నయినా సరే చదవాలని న్యూరో సైన్స్ నిపుణులు చెబుతున్నారు.
ఇక ఆలోచనా శక్తి, సృజనాత్మకత మరింతగా పెరగాలంటే.. రోజూ పజిల్స్‌ను పూరించాలని, అలాగే నాలెడ్జ్ పెరగాలంటే పాఠ్యాంశాలు, పత్రికలను చదవాలని సూచిస్తున్నారు. ఇక ఏదైనా భాషపై పట్టు పెరగాలంటే.. ఆ భాషకు చెందిన పుస్తకాలు, పత్రికలను చదవాలని సూచిస్తున్నారు. ఈ విధంగా రోజూ చేస్తే ఓ వైపు మెదడు యాక్టివ్‌గా ఉండడంతోపాటు మరోవైపు పైన తెలిపిన విధంగా స్కిల్స్ ను మెరుగు పరుచుకోవచ్చు.