Mustard Seeds : ఆవాలను నిత్యం మనం కూరల్లో వేస్తుంటాం. వీటిని వంట ఇంటి పోపు దినుసులుగా చాలా మంది ఉపయోగిస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం ఆవాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అనేక పోషకాలు కూడా వీటిల్లో ఉంటాయి. మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలైన ఐరన్, కాల్షియం, సెలీనియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఆవాల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి అధిక బరువును త్వరగా తగ్గించుకునేందుకు సహాయ పడతాయి.
ఆవాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. ఆవాలలో కొవ్వును కరిగించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటితో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
అధిక బరువు తగ్గాలనుకునే వారు ముందుగా డైట్ విషయంలో కీలక జాగ్రత్తలు పాటించాలి. రోజూ తినే ఆహారాలపై ఒక లుక్కేయాలి. ఎలాంటి ఆహారాలను తీసుకుంటున్నారు ? అనే విషయాల్లో జాగ్రత్తలను పాటించాలి. ఇక బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఆవాలను ఆహారంలో చేర్చుకోవాలి.
ఆవాలలో గ్లూకోసైనోలేట్స్, సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి పలు కూరగాయల్లో అధికంగా ఉంటాయి. అయితే ఆవాలను తీసుకోవడం వల్ల ఈ సమ్మేళనాలు మనకు లభిస్తాయి. ఇవి ఆక్సిడేటివ్ డ్యామేజ్ కలగకుండా రక్షిస్తాయి. దీంతో వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఆక్సిడేటివ్ డ్యామేజ్ వల్ల శరీరంలో వాపులు వస్తాయి. ఇది అధిక బరువుకు కారణమవుతుంది. కొవ్వు పేరుకుపోతుంది. కానీ ఆవాల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు, సమ్మేళనాలు వాపులను తగ్గిస్తాయి. దీంతో అధిక బరువు తగ్గుతారు. కొవ్వు కరుగుతుంది.
ఆవాలను రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆహారం రుచిగా లేకపోతే ఆవాలను కలిపితే రుచి పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
తలనొప్పి, ఆస్తమా సమస్యలు ఉన్నవారు రోజూ ఆవాలను తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఆవాలను రోజూ పొడి రూపంలో తీసుకోవచ్చు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఆవాల పొడి కలిపి రాత్రి నిద్రకు ముందు తాగవచ్చు. లేదా పెరుగులో కలిపి తీసుకోవచ్చు. నిమ్మరసం కలిపి కూడా తీసుకోవచ్చు. దీని వల్ల అధిక బరువు తగ్గడంతోపాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.