food

Munagaku Podi : రోజూ దీన్ని అన్నంలో మొద‌టి ముద్ద‌లో తినండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Munagaku Podi : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన పడుతున్నారు. రోగాలు అనేక మందిని చుట్టుముడుతున్నాయి. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే ఎలాంటి రోగాలు రాకుండా ఉండేందుకు, రోగాలు వ‌చ్చినా కూడా వెంట‌నే త‌గ్గేందుకు గాను ఇప్పుడు చెప్ప‌బోయే ఒక పొడిని త‌యారు చేసి తినాల్సి ఉంటుంది. దీన్ని అన్నంలో రోజూ మొద‌టి ముద్ద‌లో తినాలి. దీంతో ఎలాంటి రోగం అయినా స‌రే వెంట‌నే త‌గ్గిపోతుంది. మ‌ళ్లీ రోగాలు రాకుండా ఉంటాయి. ఇక ఆ పొడి ఏమిటి, దాన్ని ఎలా త‌యారు చేయాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మున‌గాకు పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మున‌గాకు – 4 క‌ప్పులు, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక క‌ప్పు, పెస‌ర ప‌ప్పు – అర‌ క‌ప్పు, ధ‌నియాలు – 4 టీస్పూన్లు, ఎండు మిర్చి – 12, చింత‌పండు – కొద్దిగా, బెల్లం – చిన్న ముక్క‌, జీల‌క‌ర్ర – 2 టీస్పూన్లు, మెంతులు – 2 టీస్పూన్లు, ప‌సుపు – చిటికెడు, ఉప్పు – త‌గినంత‌, నూనె – త‌గినంత‌.

how to make munagaku podi recipe many health benefits

మున‌గాకు పొడిని త‌యారు చేసే విధానం..

ముందుగా బాణ‌లిలో శ‌న‌గ‌ప‌ప్పు, పెస‌ర ప‌ప్పు, ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, మెంతులు విడివిడిగా వేయించి తీయాలి. ఇవి చ‌ల్లారాక అన్నీ క‌లిపి పొడి చేసి పెట్టుకోవాలి. త‌రువాత అందులోనే కొద్దిగా నూనె వేసి ఎండు మిర్చి వేసి వేయించి తీసి చింత‌పండు వేయాలి. ఇది కూడా కాస్త వేయించాక తీసేసి మున‌గాకు వేయించాలి. ఇప్పుడు మిక్సీలో చింత‌పండు, ఎండు మిర్చి, మున‌గాకు, ప‌సుపు, ఉప్పు, బెల్లం క‌లిపి గ్రైండ్ చేయాలి. త‌రువాత అందులోనే మ‌ళ్లీ ముందుగా చేసి పెట్టుకున్న ప‌ప్పుల పొడి వేసి మ‌ళ్లీ ఓసారి గ్రైండ్ చేసి తీయాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే మున‌గాకు పొడి రెడీ అవుతుంది. దీన్ని రోజూ అన్నంలో మొద‌టి ముద్ద‌లో తినాలి. మ‌ధ్యాహ్నం, రాత్రి ఒక్కోసారి ఒక్కో ముద్ద తింటే చాలు, ఎలాంటి రోగం రాదు. ఉన్న రోగాలు కూడా వెంట‌నే త‌గ్గుతాయి.

Admin

Recent Posts