Viral Video : కింగ్ కోబ్రా అంటే.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము. దీని విషం ఎంత ప్రమాదకరం అంటే.. ఇది కాటు వేసిన తరువాత మనిషి 15 నిమిషాల్లోగా చనిపోతాడు. ఇక దీని విషం చిన్న అణువంతైనా చాలు.. మనల్ని పక్షవాతం బారిన పడేస్తుంది. అంతటి విషపూరితమైనవి కింగ్ కోబ్రాలు. అయితే అలాంటి విషపూరితమైన పాములతో అంత సులభంగా ఎవరూ విన్యాసాలు చేయరు. ఎందుకంటే.. అవి కాటు వేస్తే ప్రాణాలే పోతాయి. కనుక వాటితో ఆటలాడే సాహసం ఎవరూ చేయరు. అయితే కొందరు ఔత్సాహికులు మాత్రం అలాంటి ఎంతటి విషపూరితమైన పాములు అయినా సరే.. వాటితో విన్యాసాలు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి కూడా సరిగ్గా ఇలాగే చేశాడు.
బ్రియాన్ బార్‌సిజిక్ అనే వ్యక్తికి పాములతో ఆడుకోవడం అంటే సరదా. మొసళ్లు.. ఇతర ప్రమాదకరమైన జీవాలతోనూ అతను విన్యాసాలు చేస్తుంటాడు. ఇక తాజాగా ఇతను ఓ కింగ్ కోబ్రాతో ఆటలాడుకున్నాడు. దాని వెనుకగా వెళ్లి ఏకంగా దాని తలమీదనే ముద్దు పెట్టుకున్నాడు. అయితే అతను మొదటి సారి అలా చేసినప్పుడు పాము కోపంతో ముందుకు కాటు వేసేందుకు బుసలు కొట్టింది. కానీ అతను వెనుక ఉన్నాడు కనుక కాటు నుంచి తప్పించుకున్నాడు.
ఇక రెండోసారి కూడా అతను పాము తలమీద అలాగే ముద్దు పెట్టుకున్నాడు. అయితే ఆశ్చర్యంగా ఈసారి పాము కదలలేదు. అతను చేస్తున్న పనిని అది ఎంజాయ్ చేసినట్లు కనిపించింది. ఇలా బ్రియాన్ ఆ కింగ్ కోబ్రాతో విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక కింగ్ కోబ్రాలు సుమారుగా 5.85 మీటర్ల పొడవు పెరుగుతాయి. అవి లేచి నిలబడ్డాయంటే చాలా దూరం నుంచి కూడా విషంతో దాడి చేయగలవు. అంతటి సమర్థతను ఆ పాములు కలిగి ఉంటాయి. కనుకనే అవి కింగ్ కోబ్రాలు అయ్యాయి.