food

మీ ఇంట్లోనే ప‌నీర్‌ను సుల‌భంగా త‌యారు చేసుకోండిలా..!

కూరలలో ఉప్పు ఎక్కువైందనిపిస్తే వేయించిన వరిపిండిని కలపాలి. పప్పులో ఒక స్పూను రిఫైన్‌డ్‌ ఆయిల్‌ లేదా రెండు వెల్లుల్లి రేకలు వేసి వండినట్లయితే గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ తగ్గుతుంది. కూరగాయలను ఉడికించేటప్పుడు ముందుగా నీటిని వేడిచేసి అప్పుడు ముక్కలను వేయాలి. ఎక్కువ సేపు నీటిలో ఉండేకొద్దీ పోషకాలు నశిస్తుంటాయి. కాబట్టి నీటిలో ఉండే సమయాన్ని తగ్గించడానికి ఇదొక పద్ధతి. పనీర్‌ను బ్లాటింగ్‌ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. పదిహేను రోజుల వరకు వాడవచ్చు. రెడీమేడ్‌ పనీర్‌ను ప్యాక్‌ ఓపెన్‌ చేసిన తరువాత వారం రోజుల్లో వాడేస్తే మంచిది. ఫ్రిజ్‌లో నుంచి తీసిన పనీర్‌ను వండే ముందు కొద్దిసేపు వేడినీటిలో వేస్తే మృదువుగా మారుతుంది.

పనీర్‌ను ఇంట్లో చేసుకోవాలంటే… పెద్ద పాత్రలో పాలను పోసి అరగంట సేపు మరిగిన తరువాత నిమ్మరసం వేయాలి. పాలు విరుగుతాయి. ఒక లీటరు పాలకు రెండు నిమ్మకాయల రసం పడుతుంది. నీటిని ఒంపేసి మళ్లీ స్టవ్‌ మీద పెట్టి మరింత నిమ్మరసం వేసి మరిగించాలి. నీరు పోయే వరకు అడుగుకు అంటకుండా జాగ్రత్తగా కాచి క్లాత్‌లో కట్టి నీటిని పోయేటట్లు చేయాలి. పాల విరుగు గట్టిగా అవుతుంది. దీనిని రౌండ్‌గా బాల్స్‌లా కాని ప్లేట్‌మీద పెట్టి క్యూబ్‌ ఆకారంలో లేదా మనకు కావలసిన అకారంలో చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పనీర్‌ను వండేటప్పుడు చిదమాల్సిన, తురమాల్సిన పనిలేదు. టిక్కాలు, స్టిక్స్‌ కోసమైతే ఆ ఆకారంలో వచ్చేటట్లు చేసుకోవాలి. అంత టైం లేకుంటే మార్కెట్‌లో దొరికే రెడీమేడ్‌ పనీర్‌ వాడుకోవచ్చు.

this is how you can make paneer at home easily

డైనింగ్‌ టేబుల్‌ మీద అందంగా ఫ్లవర్‌వాజ్‌ పెట్టుకుంటారు. అందులోనే నాలుగైదు కరివేపాకు రెమ్మలు కూడా పెడితే ఈగలు ఆ పరిసరాలకు రావు. ఇంట్లో ఇండోర్‌ ప్లాంట్‌లు పెడితే చూడడానికి అందంగా ఉంటాయి. కాని వాటిలో నీరు నిలవవుంటే అక్కడ దోమలు వ్యాప్తి చెందుతాయి. ఈ సమస్య ముఖ్యంగా ఈ కాలంలో ఎక్కువ. తరిమినా పోవు సరికదా! ఇల్లంతా చుట్టుకుంటాయి. అలాంటప్పుడు పచ్చి బంగాళాదుంపను చక్రాలుగా కోసి కుండీలో పెడితే దోమలన్నీ ఆ ముక్కల మీదకు చేరతాయి. అప్పుడు ఆ ముక్కలను జాగ్రత్తగా తీసి పారేయాలి. పెద్ద ట్రేలో మట్టిపోసి కొత్తిమీర, మెంతుల వంటివి చల్లుకుని ఆ ట్రేని వంటగది కిటికీలో కాని బాల్కనీలో కాని పెట్టుకుంటే పచ్చదనం కంటికి ఆహ్లాదాన్నిస్తూ చూడడానికి అందంగానూ ఉంటుంది. తాజా కొత్తిమీర, మెంతికూర మీకెప్పుడు అవసరం వస్తుందా! అని ఎదురు చూస్తుంటాయి.

వార్డ్‌రోబ్‌లో కాని పెట్టెల్లోకాని దుస్తులను ఎక్కువ రోజులు నిలవ ఉంచినప్పుడు వాటికి సిల్వర్‌ఫిష్‌ అనే సన్నని పురుగులు పడతాయి. ఇవి రాకుండా ఉండాలంటే లవంగాలు, దాల్చిన చెక్క పొడి చేసి దానిని సన్నని క్లాత్‌లో కట్టి రోజూ వాడని దుస్తుల మధ్య ఉంచాలి. వీటి బదులుగా పొగాకు కాడలు, ఎండిన వేపాకులను కూడా వేయవచ్చు.

Admin

Recent Posts