Home Tips

వెండి వ‌స్తువులు త‌ళ‌త‌ళా మెర‌వాలంటే.. ఇలా చేయాలి..!

ఒక టేబుల్‌ స్పూను వెనిగర్‌లో అంతే మోతాదు ఆలివ్‌ ఆయిల్‌ కలిపి తుడిస్తే ఫర్నీచర్‌ కొత్త వాటిలా మెరుస్తాయి. వెండి వస్తువులు తెల్లగా మెరవాలంటే బూడిదతో కాని బూడిదలో ఉప్పు కలిపి కాని రుద్దాలి. వజ్రాల ఆభరణాలను శుభ్రం చేయాలంటే, కొద్దిగా వాషింగ్‌ పౌడర్‌ కలిపి మరిగించిన నీటిలో పదిహేను నిమిషాల సేపు నానబెట్టాలి. సబ్బు నీటిలో నుంచి తీసినతర్వాత నీటి ధార కింద జాగ్రత్తగా కడగాలి. వజ్రాల ఆభరణాలను ధరించేముందు మెత్తటి పొడి వస్త్రంతో తుడవాలి. ఎక్కువ రోజులు దాచి ఉంచినప్పుడు కాస్త డిమ్‌ అవుతుంటాయి. ఇలా తుడిస్తే ప్రకాశవంతంగా ఉంటాయి. ముత్యాల నగలను గాలి తగిలే విధంగా జాగ్రత్త చేయాలి. ఎక్కువ రోజులు గాలి చొరని బీరువాలలో ఉంచినట్లైతే రంగు మారతాయి. వాటిని ధరించే ముందు మెత్తటి క్లాత్‌తో మెరుగుపెట్టినట్లు సున్నితంగా తుడవాలి.

వంట పాత్రలు మాడి లేదా పదార్థాల అవశేషాలు పట్టేసి మరకలైతే వాటిని శుభ్రపరిచే ముందు ఒక టబ్‌లో నీరు పోసి అందులో కొద్దిగా బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపి పాత్రలను ముంచి తీయాలి. మస్కిటో మ్యాట్‌లకు పీల్చుకునే గుణం ఎక్కువ. దుస్తుల మీద పదార్థాలు ఒలికినప్పుడు వాడేసిన మస్కిటో మ్యాట్‌లతో అద్దినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఫ్లాస్క్‌లను కొద్ది రోజులు వాడిన తరవాత వాసన వస్తుంటాయి. ఎంత కడిగినా ఆ వాసన వదలదు. అలాంటప్పుడు ఫ్లాస్క్‌లో వెనిగర్‌ కలిపిన వేడినీటితో నింపి అందులో కోడిగుడ్డు డొల్ల ఒకటి వేసి నాలుగైదు గంటల సేపు మూత పెట్టి ఉంచాలి.

follow these tips to clean silver utensils

పోస్టల్‌ స్టాంపులు కాని స్టిక్కర్లు కాని ఒకదానికొకటి అతుక్కుంటే అప్పుడు విడదీసే ప్రయత్నం చేయకుండా వాటిని అలాగే పదినిమిషాలసేపు ఫ్రీజర్‌లో పెట్టి తీయాలి. గాజు వస్తువులను వెనిగర్‌ కలిపిన నీటితో కడిగితే బాగా శుభ్రపడతాయి. పప్పులకు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటిని నిల్వ చేసే డబ్బాలలో అడుగున నాలుగైదు వెల్లుల్లి రేకలు వేయాలి.

Admin