ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల కొద్ది రోజుల కిందటి వరకు నిత్యం నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడం మళ్లీ ఆందోళనకు గురి చేస్తుంది.
గడిచిన 24 గంటల వ్యవధిలో 35,804 మందికి కరోనా టెస్టులు చేపట్టారు. ఈ క్రమంలో కొత్తగా 106 మందికి కరోనా సోకినట్లు నిర్దారించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,90,080కి చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వల్ల 7,169 మంది చనిపోయారు. ఒకే రోజులో రాష్ట్రంలో 57 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,82,137కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 774 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,40,10,204 శాంపిళ్లను పరీక్షించారు.
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,286 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లలోనే కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,24,527కు చేరుకుంది. ఇక ఒక్క రోజులో కరోనా వల్ల 91 మంది చనిపోగా మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,57,248 కు చేరుకుంది. 1,07,98,921 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.07 శాతానికి చేరుకుంది.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,68,358గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1.51 శాతం ఉండగా, మరణాల రేటు 1.41 గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 21,76,18,057 కరోనా పరీక్షలు చేశారు. సోమవారం ఒక్క రోజే 7,59,283 పరీక్షలు చేశారు.