Aloe Vera Gel At Home : కలబంద.. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని మనందరికి తెలుసు. మన ఆరోగ్యాన్ని కాపాడడంలో, చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కలబంద మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబంద వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కలబంద జెల్ ను మనం ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ కలబంద జెల్ మనకు బయట ఆయుర్వేద షాపుల్లో లభిస్తుంది. అయితే ఈ జెల్ ను మనం బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కలబంద జెల్ ను ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కలబంద జెల్ ను తయారు చేసుకోవడానికి ముందుగా లావుగా పొడవుగా ఉండే కలబంద ముక్కను తీసుకోవాలి.
తరువాత దీనిని శుభ్రంగా కడిగి పక్కలకు ఉండే ముళ్లలను తీసి వేయాలి. తరువాత కలబందను నిలువుగా రెండు భాగాలుగా చేసుకోవాలి. తరువాత లోపల ఉండే కలబంద గుజ్జును చేత్తో లేదా చాకుతో తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ గుజ్జును ఒక జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ కలబంద జెల్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి దీనిలో విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను వేసి కలపాలి. ఈ విటమిన్ క్యాప్సుల్ ప్రిజర్వేటివ్ గా పని చేయడంతో పాటు చర్మాన్ని సంరక్షించడంలో కూడా సహాయపడుతుంది. ఇలా తయారు చేసుకున్న కలబంద జెల్ ను గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి.
ఇలా నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల పాటు ఈ జెల్ తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న కలబంద జెల్ ను నేరుగా చర్మానికి ఉపయోగించవచ్చు. చర్మాన్ని తెల్లగా మార్చడంలో ఈ కలబంద జెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ ఫ్యాక్ లలో, హెయిర్ ఫ్యాక్ లలో ఈ కలబంద జెల్ ను నేరుగా ఉపయోగించవచ్చు. దీనిని చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం పైఉండే అలర్జీలు తొలగిపోతాయి. అంతేకాకుండా చర్మం పై ఉండే మొటిమలు, మచ్చలు, గాయాలు కూడా తొలగిపోతాయి. ఈ విధంగా కలబంద జెల్ ను సహజ సిద్దంగా ఇంట్లోనే తయారు చేసుకుని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు చక్కటి సౌందర్యాన్ని కూడా పొందవచ్చు.