Vitamin D Tablets : ప్రస్తుత తరుణంలో చాలా మంది విటమిన్ల లోపాలతో బాధపడుతున్నారు. పోషకాహార లోపం వస్తుండడం వల్ల విటమిన్ల ట్యాబ్లెట్లను వాడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే బి కాంప్లెక్స్ విటమిన్లతోపాటు విటమిన్లు ఎ, సి, డి, ఇ, కె వంటి ట్యాబ్లెట్లను వాడుతున్నారు. అయితే వాస్తవానికి ఏ ట్యాబ్లెట్ అయినా సరే డాక్టర్ సూచన మేరకు వాడాలి అన్న నియమం ప్రకారం.. విటమిన్ల ట్యాబ్లెట్లను కూడా డాక్టర్ వాడమని చెబితేనే వాడాలి. లేదంటే వాడరాదు. కానీ కొందరు డాక్టర్ సూచన లేకున్నా.. విటమిన్ల ట్యాబ్లెట్లే కదా.. అని చెప్పి అధిక మోతాదులో వాటిని వాడుతున్నారు. కానీ ఇలా వాడడం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ల ట్యాబ్లెట్లను డాక్టర్ సూచన మేరకు వాడాలి. అది కూడా కొంత కాలం పాటు మాత్రమే వాడాలి. మోతాదుకు మించి వాడితే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
మనకు అందుబాటులో ఉన్న విటమిన్ ట్యాబ్లెట్లలో బి కాంప్లెక్స్‌తోపాటు విటమిన్లు ఎ, సి, డి, ఇ, కె కూడా ఉన్నాయి. వీటిని కాంబినేషన్లలో విక్రయిస్తారు. లేదా విడి ట్యాబ్లెట్లు కూడా లభిస్తున్నాయి. అయితే విటమిన్ డి ట్యాబ్లెట్లను సాధారణంగా విడిగానే విక్రయిస్తారు. వేరే విటమిన్ల కాంబినేషన్‌లతో విక్రయించరు. ఈ క్రమంలోనే వీటిని చాలా మంది తెచ్చుకుని వాడుతున్నారు. డాక్టర్ చెప్పకపోయినా విటమిన్ డి ట్యాబ్లెట్లను రోజూ మింగుతున్నారు. కానీ ఇలా విటమిన్ డి ట్యాబ్లెట్లను మింగడం వల్ల తీవ్ర అనర్థాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విటమిన్ డి ట్యాబ్లెట్ల వల్ల కిడ్నీలు చెడిపోతాయని అంటున్నారు. అసలు విటమిన్ డి ట్యాబ్లెట్లను అధికంగా వాడితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ డి లోపం ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు వారానికి 60వేల యూనిట్ల కెపాసిటీ ఉండే ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. విటమిన్ డి ని రోజువారీగా వాడాల్సి వస్తే.. గరిష్టంగా 2000 యూనిట్ల కెపాసిటీ ఉన్న ట్యాబ్లెట్ చాలు. ఇవి కూడా లోపం ఉంటేనే అది కూడా డాక్టర్ సలహా మేరకు వాడాలి. కానీ కొందరు వీటిని అతిగా వాడుతున్నారు. దీంతో విటమిన్ డి శరీరంలో ఎక్కువగా పేరుకుపోతుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. కనుక శరీరంలోని కొవ్వులో కరిగి నిల్వ ఉంటుంది. ఈ క్రమంలో మనం విటమిన్ డి ట్యాబ్లెట్లను మోతాదుకు మించి వేసుకుంటే.. మన శరీరంలోని కొవ్వులో ఆ విటమిన్ అధికంగా చేరుతుంది. అందులో నుంచి శరీరం తనకు కావల్సినంత వాడుకున్నా ఇంకా ఎక్కువగానే మిగిలి ఉంటుంది. ఇది బయటకు వెళ్లదు. దీంతో శరీరంలో కాల్షియం పరిమాణం పెరిగిపోతుంది.
శరీరంలో కాల్షియం పెరిగితే అది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. దీంతో కిడ్నీలు చెడిపోతాయి. డయాలసిస్ చేయాల్సి వస్తుంది. ఫలితంగా కిడ్నీలు పనిచేయకుండా పోతాయి. అప్పుడు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. కనుక విటమిన్ డి ట్యాబ్లెట్లను అధికంగా వాడితే పరిస్థితి ఎక్కడి వరకు వెళ్తుందో చూశారు కాబట్టి.. వాటిని వాడే విషయంలో జాగ్రత్తలు అవసరం. డాక్టర్ సలహా మేరకు మాత్రమే విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడాలని సూచిస్తున్నారు. కాబట్టి విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడే విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఇష్టానుసారంగా వీటిని వేసుకుంటే ఇబ్బందులు తప్పవనే విషయాన్ని గ్రహించండి. ముందుగానే జాగ్రత్త పడితే అప్పుడు ప్రాణాల మీదకు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.