Guava Leaves : అద్భుతమైన పోషకాలు ఉండే జామ ఆకులు.. వీటితో కలిగే లాభాలు తెలిస్తే విడిచిపెట్టరు..!

Guava Leaves : జామ పండ్లను పేదోడి యాపిల్‌ అంటారు. అంటే.. యాపిల్‌ పండ్లలాగే జామ పండ్లలోనూ అనేక పోషకాలు ఉంటాయన్నమాట. పైగా యాపిల్‌ పండ్ల కన్నా ధర తక్కువ. అందుకనే జామ పండ్లను పేదోడి యాపిల్‌ అంటారు. అయితే జామ పండ్లే కాదు, జామ ఆకులు కూడా మనకు అద్భుతంగా ఉపయోగపడతాయి. మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను జామ ఆకులతో తగ్గించుకోవచ్చు. జామ ఆకులతో మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

amazing health benefits of Guava Leaves

1. జామ ఆకుల్లో విటమిన్‌ ఎ, సిలతోపాటు ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం అధికంగా ఉంటాయి. అందువల్ల మనకు పోషణ లభిస్తుంది. అలాగే ఈ ఆకుల్లో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. కెరోటినాయిడ్లు, పాలిఫినాల్స్ కూడా అధికమే. వీటితో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి బయట పడవచ్చు.

2. జామ ఆకుల్లో క్యాన్సర్‌ వ్యతిరేక గుణాలు ఉంటాయి. అందువల్ల క్యాన్సర్‌ రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే జామ ఆకుల్లో ఉండే యాంటీ మైక్రోబియల్‌ గుణాలు మనకు వ్యాధులు రాకుండా చూస్తాయి.

3. అధిక బరువును తగ్గించడంలో జామ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి శరీర మెటబాలిజంను పెంచి కొవ్వును కరిగిస్తాయి. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది.

4. జామ ఆకుల వల్ల కొల్లాజెన్‌ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. దీనివల్ల ముఖం మీద ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు.

5. కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గించడంలో జామ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

6. డయాబెటిస్‌ ఉన్నవారికి జామ ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి షుగర్‌ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది.

7. స్త్రీలు నెలసరి సమయంలో నొప్పులతో సతమతం అవుతుంటారు. అలాంటి వారికి జామ ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి. నొప్పులను తగ్గిస్తాయి.

జామ ఆకులను రోజూ తినలేరు. కానీ ఒకటి రెండు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం వచ్చే నీటిని వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి హెర్బల్‌ టీ మాదిరిగా తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే చాలు, జామ ఆకుల వల్ల ప్రయోజనాలను పొందవచ్చు.

Share
Admin

Recent Posts