Peanuts : పల్లీలను మనం వంట గదిలో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. వీటిని తినని వారు ఉండరనే చెప్పవచ్చు. పల్లీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు శరీరానికి అవసరమయ్యే పోషకాలను కూడా తినవచ్చు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, పాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ బి, ఆమైనో యాసిడ్లు వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. పల్లీలను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు ధృడంగా, ఆరోగ్యవంతంగా ఉంటాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. పల్లీలను తీసుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ లు మన దరి చేరకుండా ఉంటాయి. పల్లీలల్లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వృద్ధాప్య ఛాయలను మన దరి చేరకుండా చేస్తాయి. పల్లీలను ఎక్కువగా వేయించి, ఉడికించి తింటూ ఉంటారు.
పల్లీలను ఇలా తినడానికే చాలా మంది ఇష్టపడతారు. ఇతర ఆహార పదార్థాలను తిన్న తరువాత నీటిని తాగినట్టే పల్లీలను తిన్న తరువాత కూడా నీటిని తాగుతూ ఉంటాం. అయితే పల్లీలను తిన్న తరువాత నీటిని తాగకూడదు. ఇది మంచి పద్దతి కాదు. పల్లీలను తిన్న తరువాత నీటిని తాగకూడదని పెద్ద వారు చెబుతూ ఉంటారు. చాలా మంది ఇలా నీటిని తాగకూడదని వినే ఉంటారు. కానీ ఎందుకుతాగకూడదని మాత్రం తెలియదు. దీనికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి. పల్లీల్లో నూనె ఎక్కువగా ఉంటుంది. వీటిని తిన్న తరువాత నీటిని తాగితే ఈ నీరు నూనెతో చేరి ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. దీంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. అలాగే పల్లీలను తిన్న తరువాత నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావు. దీంతో గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కనుక పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగకూడదు. అదే విధంగా పల్లీలు సహజంగానే శరీరంలో వేడిని కలిగిస్తాయి. నీరు శరీరానికి చలువ చేస్తుంది. వేడి పదార్థాలు, చల్లటి పదార్థాలు ఒక దానికి ఒకటి విరుద్ధంగా పని చేస్తాయి. కనుక పల్లీలను తినగానే నీటిని తాగడం వల్ల అవి ఒక దానికి ఒకటి విరుద్దంగా పని చేస్తాయి. దీంతో జలుబు, దగ్గు,. ఆయాసం వంటి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. పల్లీలను తిని నీటిని తాగడం వల్ల కొన్ని సందర్భాల్లో ఎలర్జీలు కూడా కలుగుతాయి. కనుక పల్లీలను తిన్న అరగంట నుండి గంట తరువాత మాత్రమే నీటిని తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది.