Ash Gourd Juice : బూడిద గుమ్మడి.. ఇది మనందరికి తెలిసిందే. చాలా మంది దీనిని ఇంటి గుమ్మానికి, వ్యాపార సంస్థలకు దిష్టి తగలకుండా కడతారు. అలాగే దీనితో గుమ్మడికాయ వడియాలు కూడా తయారు చేస్తారు. చాలా మందికి బూడిద గుమ్మడి గురించి ఇది మాత్రమే తెలుసు. కానీ బూడిద గుమ్మడిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిని జ్యూస్ గా చేసి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బూడిద గుమ్మడిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని దీనిని జ్యూస్ గా చేసి తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బూడిద గుమ్మడిలో ఉండే పోషకాలు మరియు ఔషధ గుణాల గురించి అలాగే దీనిని జ్యూస్ గా చేసి తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బూడిద గుమ్మడిలో విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, సి,ఐరన్, క్యాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. బూడిద గుమ్మడి జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. మనం ఎక్కువగా ఆహారాన్ని తీసుకోలేము. దీంతో మనంసులభంగా బరువు తగ్గవచ్చు. బూడిద గుమ్మడి జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. బూడిద గుమ్మడి జ్యూస్ ను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా తయారవుతుంది. ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
గుండె సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్స్, అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడం చాలా సులభం. బూడిద గుమ్మడిపై ఉండే చెక్కును తీసేసి ముక్కలుగా చేసి జార్ లో వేసుకోవాలి. తరువాత నిమ్మరసం వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని తాగాలి. ఈ జ్యూస్ ను వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ విధంగా బూడిద గుమ్మడికాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని జ్యూస్ గా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.