హెల్త్ టిప్స్

Bitter Gourd Seeds Health Benefits : కాక‌ర‌కాయ గింజ‌ల‌ని ప‌డేస్తున్నారా.. అయితే ఇవి తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!

Bitter Gourd Seeds Health Benefits : కాకరకాయతో, మనం చాలా రకాలు వంటకాలు తయారు చేసుకోవచ్చు. కాకరకాయ ఫ్రై, కూర ఇలా రకరకాల వంటకాలను, చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే, కాకరకాయ చేదుగా ఉన్నా కూడా, రుచి బాగానే ఉంటుంది. కాకరకాయలులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. రుచి నచ్చినప్పటికీ పోషకాలు ఉంటాయి కాబట్టి, తీసుకోవడమే మంచిది. అయితే, కాకరకాయని తీసుకుని చాలామంది, కాకరకాయ గింజలని వదిలేస్తూ ఉంటారు. కానీ, నిజానికి కాకరకాయ గింజల్లో కూడా పోషకాలు ఎక్కువ ఉంటాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. కాకరకాయ లాగే, కాకరకాయ గింజలు కూడా చేదుగానే ఉంటాయి. కాకరకాయ గింజల్లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియంతో పాటుగా విటమిన్ సి, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటాయి.

కాకరకాయ గింజలు డయాబెటిస్ ని తగ్గించడానికి, బాగా ఉపయోగపడతాయి. కాకరకాయ గింజలు డయాబెటిస్ కారణంగా వచ్చే, సమస్యల్ని కూడా తగ్గించగలవు. ఈ గింజల్ని మనం ఎండబెట్టేసి, పొడిగా చేసుకుని తీసుకుంటే మంచిది. చిటికెడు కాకరకాయ గింజల పొడిలో, గోరువెచ్చని నీళ్ళు పోసి తాగితే రక్తంలో చక్కెర, గుండెపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్న వారిలో, వచ్చే మలబద్ధకం కూడా తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ ని ఇది పెంచుతుంది.

bitter gourd seeds many wonderful health benefits

గుండెని కూడా ఆరోగ్యంగా ఉంచగలదు. అధిక బరువు సమస్య ఉన్నవాళ్లు, కాకరకాయ గింజల పొడిని తీసుకుంటే, శారీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది అలానే జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.

విటమిన్ సి కూడా కాకరకాయ గింజల్లో ఎక్కువ ఉంటుంది. చర్మాన్ని ముడతలు లేకుండా, ఉంచేందుకు కాకరకాయ గింజలు బాగా ఉపయోగపడతాయి. అకాల వృద్ధాప్యాన్ని నివారించేందుకు కూడా ఉపయోగపడతాయి. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ వ్యాధులను కూడా కాకరకాయ గింజలు పోగొడతాయి. ఇలా అనేక లాభాలు ఉన్నాయి, కాబట్టి, ఈసారి తప్పకుండా తీసుకోండి.

Admin

Recent Posts