Black Cardamom Tea : ఈ టీని ఇలా తయారు చేసి రోజుకు ఒక కప్పు తాగండి.. న‌రాల బ‌ల‌హీన‌త ఉండ‌దు..

Black Cardamom Tea : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది న‌రాల బ‌ల‌హీన‌త‌, న‌రాల నొప్పులు, న‌రాల వాపులు, అలాగే వాటిలో పూడిక‌లు ఏర్ప‌డ‌డం వంటి వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇటువంటి న‌రాల సంబంధిత స‌మ‌స్య‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారిలో మ‌నం ఈ న‌రాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ఎక్కువ‌గా చూడ‌వ‌చ్చు. అలాగే కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారిలో, మూత్ర‌పిండాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారిలో కూడా ఈ స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి. అంతేకాకుండా పోష‌కాహార లోపం వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అంతేకాకుండా ధూమ‌పానం, మ‌ద్య‌పానం ఎక్కువ‌గా చేసే వారిలో కూడా న‌రాల సంబంధిత స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి.

శ‌రీరంలో ఎక్కువ‌గా వేడిగా ఉండ‌డం, త‌ల తిరిగిన‌ట్టు ఉండ‌డం, న‌రాల బ‌ల‌హీన‌త ఉన్న చోట నొప్పులు రావ‌డం, చెమ‌ట‌లు ఎక్కువ‌గా ప‌ట్ట‌డం, ర‌క్త‌పోటు స‌మ‌స్య త‌లెత్త‌డం వంటి ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి మ‌నం న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య త‌లెత్తిన‌ట్టు గుర్తించ‌వ‌చ్చు. అలాగే న‌రాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడే వారిలో జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి. అజీర్తి, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. అంతేకాకుండా న‌రాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారిలో మ‌తిమ‌రుపు కూడా వ‌స్తూ ఉంటుంది. ఈ ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి మ‌నం న‌రాల సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ట్టుగా గుర్తించ‌వ‌చ్చు. ఇటువంటి న‌రాల సంబంధిత స‌మ‌స్య‌ల‌ను మ‌నం చాలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌న ఇంట్లో ఉండే మ‌సాలా దినుసుల‌తో ఒక టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల న‌రాలకు సంబంధించిన అన్ని స‌మ‌స్య‌ల నుండి మ‌నం బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

Black Cardamom Tea how to make it and benefits
Black Cardamom Tea

న‌రాల సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఈ టీ ని ఎలా త‌యారు చేసుకోవాలి…ఎలా వాడాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టీ ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం దాల్చిన చెక్క‌ను, ల‌వంగాల‌ను, న‌ల్ల యాల‌కుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా దాల్చిన చెక్క‌ను పొడిగా చేసుకోవాలి. అలాగే రెండు ల‌వంగాల‌ను, ఒక న‌ల్ల యాల‌క్కాయ‌ను క‌చ్చా ప‌చ్చాగా దంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి చిన్న మంట‌పై వేడి చేయాలి. ఇందులోనే పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి అలాగే దంచిన ల‌వంగాలు, న‌ల్ల యాల‌క్కాయ మిశ్ర‌మం వేసుకుని మ‌రిగించాలి. ఈ నీటిని చిన్న మంట‌పై అర గ్లాస్ క‌షాయం అయ్యే వ‌ర‌కు బాగా మ‌రిగించాలి. త‌రువాత ఈ టీ ని వ‌డ‌క‌ట్టుకుని ఒక క‌ప్పులోకి తీసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న టీ ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి.

ఈ విధంగా ఈ టీని త‌యారు చేసుకుని తాగ‌డం వల్ల న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. న‌రాలల్లో ఉండే అడ్డంకులు అన్నీ తొల‌గిపోతాయి. న‌రాల నొప్పులు త‌గ్గుతాయి. ఈ టీని తాగ‌డం వ‌ల్ల న‌రాల స‌మ‌స్య‌లు త‌గ్గ‌డంతో పాటు కాలేయం ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. న‌రాల సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ టీని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

D

Recent Posts