Black Cumin : రోజూ తీసుకుంటే చాలు.. జీర్ణ స‌మ‌స్య‌లు, షుగ‌ర్‌, కీళ్ల నొప్పులు మాయం..!

Black Cumin : మ‌న‌కు చాలా సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం అరికాళ్ల నుండి త‌ల వ‌ర‌కు వ‌చ్చే అనేక రకాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఈ పొడిని వాడ‌డం వ‌ల్ల అధిక బ‌రువు, షుగ‌ర్, ర‌క్త‌పోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇవే కాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, తిమ్మిర్లు, గౌట్, ఆర్థ‌రైటిస్, వాత దోషాలు, యూరిక్ యాసిడ్ స్థాయిలు పెర‌గడం వంటి 80 కు పైగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఈ పొడిని వాడ‌డం వ‌ల్ల న‌యం చేసుకోవ‌చ్చు. ఈ పొడిని వాడ‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులు తొల‌గిపోతాయి. మందులు వాడ‌డం వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల బారిన ప‌డకుండా ఉంటాము. ఈ పొడిని వాడ‌డం, అలాగే త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. ఈ పొడిని 15 రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అలాగే దీనిని రెండు నెల‌ల పాటు వాడ‌డం వ‌ల్ల ఎంతో కాలంగా వేధిస్తున్న గౌట్ స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది.

మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అలాగే దీనిని ఎలా వాడాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పొడిని వాడ‌డానికి గానూ మ‌నం ఒక టీ స్పూన్ న‌ల్ల జీల‌కర్ర‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఈ న‌ల్ల జీల‌క‌ర్ర చాలా చేదుగా ఉంటుంది. దీనిని ఔష‌ధంగా మాత్ర‌మే ఉప‌యోగించాలి. అధిక బ‌రువు, షుగ‌ర్, కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. దీనిని వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన మ‌లినాలు, వ్య‌ర్థ ప‌దార్థాలు తొల‌గిపోతాయి. వాత దోషాల‌ను త‌గ్గించ‌డంలో కూడా ఈ జీల‌క‌ర్ర మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే మ‌నం ఉప‌యోగించాల్సిన రెండో ప‌దార్థం మెంతులు. వీటిని 5 టీ స్పూన్ల మోతాదులో ఉప‌యోగించాల్సి ఉంటుంది. వాత దోషాల‌ను త‌గ్గించ‌డంలో, షుగ‌ర్ ను అదుపులో ఉంచ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, కీళ్ల నొప్పుల‌ను, మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో మెంతులు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాగే మ‌నం ఉప‌యోగించాల్సిన మూడో ప‌దార్థం వాము.

Black Cumin with fenugreek and ajwain seeds very helpful
Black Cumin

దీనిని రెండు టీ స్పూన్ల మోతాదులో ఉప‌యోగించాల్సి ఉంటుంది. షుగ‌ర్ ను అదుపులో ఉంచ‌డంలో, జీర్ణ‌స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో వాము దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుంది. అంతేకాకుండా దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తొల‌గిపోతుంది. వీటితో పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పొడిని త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా క‌ళాయిలో మెంతులను వేసి వేయించాలి. వీటిని చిన్న మంట‌పై దోర‌గా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో వాము వేసి వేయించాలి. వామును కూడా వేయించిన త‌రువాత న‌ల్ల జీల‌కర్ర‌ను వేసి చిన్న మంట‌పై వేయించి వీటిని పూర్తిగా చ‌ల్లారనివ్వాలి. త‌రువాత వీటిని ఒక జార్ లో వేసి మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న‌ పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి బాగా క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న నీటిని రాత్రి భోజ‌నం చేసిన గంట త‌రువాత టీ తాగిన‌ట్టు తాగాలి.

ఈ నీటిని తాగిన త‌రువాత ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అలాగే 8 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌ల‌కు దీనిని ఔష‌ధంగా ఇవ్వ‌కూడ‌దు. ఈ విధంగా ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం శుభ్ర‌ప‌డుతుంది. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. శ‌రీరంలో కొత్త ర‌క్తం త‌యార‌వుతుంది. దీంతో చ‌ర్మం కాంతివంతంగా క‌న‌బడుతుంది. ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. గౌట్, ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌లు తగ్గుతాయి. జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ప‌ని చేస్తుంది. ఈ విధంగా ఈ పొడిని మ‌న ఇంట్లోనే త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts