హెల్త్ టిప్స్

Black Pepper Water : ఈ సీజ‌న్‌లో మిరియాల నీళ్ల‌ను రోజూ త‌ప్ప‌క తాగాలి.. ఎందుకంటే..?

Black Pepper Water : మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ఎంతటి కీల‌క‌పాత్ర‌ను పోషిస్తుందో అంద‌రికీ తెలిసిందే. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ స‌రిగ్గా లేక‌పోతే మ‌న‌కు అనేక వ్యాధులు వ‌స్తాయి. అవి ఎప్ప‌టికీ త‌గ్గ‌వు. ముఖ్యంగా చ‌లికాలంలో మ‌న‌కు ద‌గ్గు, జ‌లుబు అధికంగా వ‌స్తాయి. ఇలాంటి స‌మ‌యంలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ మెరుగ్గా ప‌నిచేయాలి. అప్పుడే మ‌న‌కు వ‌చ్చే సీజ‌న‌ల్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అయితే ఈ విష‌యాన్ని మాత్రం చాలా మంది నిర్ల‌క్ష్యం చేస్తుంటారు. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునే ప్ర‌య‌త్నం చేయ‌రు. కానీ ఈ విష‌యంపై త‌ప్ప‌క దృష్టి సారించాలి. ఇక రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు మిరియాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటితో త‌యారు చేసే నీళ్ల‌ను ఈ సీజ‌న్‌లో రోజూ తాగాలి. దీంతో ద‌గ్గు, జ‌లుబు వంటివే కాదు.. అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

మిరియాల నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అనేక వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. ముఖ్యంగా ద‌గ్గు, జ‌లుబు త‌గ్గుతాయి. అలాగే ఈ సీజ‌న్‌లో బ‌రువు త‌గ్గ‌డం క‌ష్టంగా ఉంటుంది. అలాంటి వారు మిరియాల నీళ్ల‌ను రోజూ తాగాలి. దీంతో త‌ప్ప‌క ఫ‌లితం క‌నిపిస్తుంది. మిరియాలు మ‌న శ‌రీరంలోని కొవ్వును క‌రిగిస్తాయి. దీంతో బ‌రువు త‌గ్గుతారు. ఈ నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. అలాగే డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటాం. శ‌రీరంలోని ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. చ‌ర్మం పొడిబార‌కుండా ఉంటుంది. చ‌లికాలంలో ఇది మ‌న‌కు ఎంతగానో మేలు చేసే విష‌యం.

Black Pepper Water must take in winter season know why

చ‌లికాలంలో జీర్ణ‌శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది. దీంతో అజీర్ణం ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. అలాగే గ్యాస్‌, క‌డుపునొప్పి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు కూడా ఈ సీజ‌న్‌లోనే ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. అలాంట‌ప్పుడు మిరియాల నీళ్ల‌ను తాగితే త‌ప్ప‌క ఫ‌లితం ఉంటుంది. మిరియాల్లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో దీన్ని ఎంతో కాలంగా ఉప‌యోగిస్తున్నారు. వంట‌ల్లో కారంకు ప్ర‌త్యామ్నాయంగా మిరియాల పొడిని వాడుకోవ‌చ్చు. దీంతో రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ ల‌భిస్తాయి. ఇక మిరియాల నీళ్ల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక పాత్ర‌లో ఒక‌టిన్న‌ర క‌ప్పుల నీళ్ల‌ను తీసుకోవాలి. మిరియాల‌ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దంచి పొడి చేయాలి. ఈ పొడిని నీటిలో వేసి మ‌రిగించాలి. నీళ్లు ఒక క‌ప్పు అయ్యే వ‌ర‌కు స‌న్న‌ని మంట‌పై మ‌రిగించాలి. అనంత‌రం వ‌డ‌క‌ట్టాలి. దీంతో మిరియాల నీళ్లు రెడీ అవుతాయి. అయితే ఇవి ఘాటుగా ఉన్నాయ‌నుకుంటే రుచి కోసం కాస్త తేనె క‌లుపుకోవ‌చ్చు. ఇలా మిరియాల నీళ్ల‌ను త‌యారు చేసి రోజూ ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంత‌రం లేదా రాత్రి నిద్ర‌కు ముందు ఒక క‌ప్పు మోతాదులో తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts