హెల్త్ టిప్స్

Black Sesame Seeds : రోజూ ఒక స్పూన్ న‌ల్ల నువ్వుల‌ని ఇలా తినండి.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

Black Sesame Seeds : నల్ల నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన వంటింట్లో ఉండే, ఎన్నో రకాల ఆహార పదార్థాలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచగలవు. మంచి పోషకాలు నల్ల నువ్వుల్లో ఉంటాయి. రోజు నల్ల నువ్వుల్ని వాడడం వలన, అనేక ఉపయోగాలు ఉంటాయి. నువ్వులలో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఇలా రెండు రకాలు ఉంటాయి. నువ్వులు రుచి కూడా బాగుంటుంది. ఆయుర్వేదంలో నువ్వులకి ప్రత్యేక స్థానం కూడా ఉంది. నువ్వులలో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ తో పాటుగా ఫ్లెవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కూడా ఉంటాయి.

రెండు రకాల నువ్వులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నల్ల నువ్వుల కంటే, తెల్ల నువ్వుల లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు మంచి సువాసనని కలిగి ఉంటాయి. నువ్వులలో మెగ్నీషియం కూడా ఉంటుంది. రక్తపోటుని కంట్రోల్ చేయగలదు. అలానే, షుగర్ ని కూడా కంట్రోల్ చేయగలదు. నువ్వుల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి, జీర్ణ సమస్యలు ఉండవు. పేగుల్లో వ్యర్థ పదార్థాలు సక్రమంగా బయటకి వెళ్తాయి.

black sesame seeds many wonderful health benefits

తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు లో, ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ లోపం వలన వచ్చే రక్తహీనత నుండి బయట పడాలంటే, రోజు ఒక స్పూన్ నల్ల నువ్వులు తీసుకోండి.

అలానే లివర్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు సమస్యతో కూడా, చాలామంది బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళు నువ్వులను తీసుకుంటే, ఈ సమస్య నుండి బయటపడొచ్చు. నువ్వుల్లో కాపర్ కీళ్ల నొప్పులు సమస్య నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. రాత్రిపూట నువ్వులేని నీళ్ళల్లో నానబెట్టుకుని, ఉదయాన్నే నమిలి తినేస్తే చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యాన్ని ఇంకాస్త మెరుగుపరుచుకోవచ్చు.

Admin

Recent Posts