Broad Beans For Nerves Health : సాధారణంగా మన శరీరంలో సంకేతాలన్నీ నరాల ద్వారా వ్యాపిస్తాయి. సంకేతాలను అవయవాల నుండి మెదడుకు మరలా మెదడు నుండి అవయవాలకు నరాలు చేరవేరుస్తూ ఉంటాయి. ఈ నరాల్లో ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ను డోపమిన్ అనే హార్మోన్ అదుపులో ఉంచుతుంది. ఈ హార్మోన్ తగ్గిపోవడం వల్ల నరాల్లో ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీంతో పార్కిన్ సన్స్ సమస్య తలెత్తుతుంది. పూర్వకాలంలో ఈ సమస్య 60 ఏళ్లు పైబడిన వారిలో వచ్చేది. కానీ నేటి తరుణంలో 45 నుండి 50 సంవత్సరాల లోపే వస్తుంది. పార్కిన్ సన్స్ సమస్యతో బాధపడే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుంది. ఈ సమస్య స్త్రీలల్లో తక్కువగా ఉంటుంది. పురుషుల్లో మూడింతలు ఎక్కువగా వస్తుంది. డొపమిన్ అనేది ఒక హ్యాపీ హార్మోన్. స్త్రీలల్లో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ కారణంగా వారిలో ఒత్తిడి తక్కువగాఉంటుంది.
వారు ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండగలుగుతారు. దీంతో వారిలో డొపమిన్ హార్మోన్ ఎక్కువగా తయారవుతుంది. కానీ పురుషులు చాలా మంది ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతూ ఉంటారు. మానసికంగా కూడా కృంగిపోతూ ఉంటారు. దీంతో డొపమిన్ హార్మోన్ తక్కువగా విడుదల అవుతుంది. ఈ కారణాల చేత పార్కిన్ సన్స్ సమస్య పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. అలాగే ఈ సమస్య జన్యుపరంగా కూడా వస్తుంది. అంతేకాకుండా మెదడుకు దెబ్బలు, గాయాలు తగిలినప్పుడు కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఊబకాయం కారణంగా శరీరంలో ఫ్రీరాడికల్స్ ఎక్కువగా తయారవుతున్నాయి. ఇవి మెదడు కణాలను దెబ్బతీస్తున్నాయి. దీంతో మెదడు కణాల నుండి డొపమిన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయ్యి పార్కిన్ సన్స్ సమస్య తలెత్తుతుంది.
అదే విధంగా ఒత్తిడి, కోపం, ఆవేశం, ఆందోళన, ప్రతి చిన్న విషయానికి కంగారు పడడం, భయం, డిప్రెషన్ వంటి వాటితో బాధపడే వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పార్కిన్ సన్స్ సమస్యతో బాధపడే వారిలో చేతులు, మెడ, కాళ్లు వణుకుతూ ఉంటాయి. మాటలు కూడా వణికినట్టుగా ఉంటాయి. కళ్లు ఆర్పకుండా తదేకంగా చూస్తూ ఉంటారు. ఈ సమస్యతో బాధపడే వారిలో స్పందించడం కూడా తక్కువగా ఉంటుంది. కండరాలపై నియంత్రణను కోల్పోతారు. సరిగ్గా నడవలేకపోతారు. ఈ విధంగా ఈ సమస్యను మనం సులభంగా గుర్తించవచ్చు. ఈ సమస్య ప్రారంభదశలో ఉన్నప్పుడు జీవన శైలిలో మార్పుల ద్వారా మనం సమస్య నుండి బయటపడవచ్చు. అదే సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మందులు వాడాలి. సమస్య ముదిరిన తరువాత జీవన శైలిలో మార్పులు చేసుకున్నప్పటికి సమస్య అదుపులో మాత్రమే ఉంటుంది.
ప్రారంభ దశలో ఉన్నప్పుడు సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు. పార్కిన్ సన్స్ సమస్యతో బాధపడే వారు డొపమిన్ హార్మోన్ ఎక్కువగా విడుదలయ్యే ఆహారాలను తీసుకోవాలి. చిక్కుడు గింజలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు, పులిసిన ఆహారాలు, పండిన అరటిపండ్లు వంటి వాటిని తీసుకోవాలి. అలాగే బాదంపప్పు, పుచ్చగింజల పప్పు, మొలకెత్తించిన గింజలు, వాల్ నట్స్, అవిసె గింజలు వంటి వాటిని తీసుకోవాలి. అలాగే రోజుకు రెండు పూటలా ప్రాణాయామం చేయాలి. ఒత్తిడి, ఆందోళన వంటివి దరి చేరకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో సంతోసంగా గడిపై ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల పార్కిన్ సన్స్ సమస్య తగ్గడంతో పాటు మన దరి చేరకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.