హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు మ‌ద్యం సేవించ‌వ‌చ్చా..?

డయాబెటిక్ రోగులు ఆల్కహాలు తీసుకోరాదు. కొద్దిపాటి ఆల్కహాలు బాగానే వుంటుంది. డయాబెటీస్ వున్నా లేకున్నా ఆల్కహాలు అధికం అయితే శరీరానికే హాని. ఆల్కహాలు తీసుకుంటే లో షుగర్ పరిస్ధితి ఏర్పడే ప్రమాదం వుందనేది గుర్తుంచుకోండి. ఆల్కహాలు తాగి ఆహారం తీసుకోకుంటే మరింత ప్రమాదకరం. ఆల్కహాలు వైద్యపరంగా ఎంత తీసుకోవచ్చో మీరు తెలుసుకోవాలి. కొద్దిపాటి విస్కీ, రమ్, వోడ్కా లేదా జిన్, ఒక గ్లాసు బీరు లేదా వైన్ ఒక యూనిట్ గా లెక్కించబడుతుంది. వారానికి పురుషులకు 21 మహిళలకు 14 యూనిట్లు అనుమతించబడింది.

వారంలో ఒక్క రోజే ఆ కోటా అంతా తాగేకంటే గ్యాప్ ఇస్తూ వారమంతా తాగటం మంచిది. స్వీట్ వైన్ లేదా షెర్రీ వంటివాటిలో అధిక షుగర్ వుంటుంది కనుక వాటిని వదిలేయటం మంచిది. సాధారణంగా తాగేటపుడు మనం ఏం తింటున్నామో తెలియదు. అధిక కొవ్వు లేదా అధిక కేలరీ కల పనీర్ లేదా పకోడిలు డ్రింక్ తో తీసుకుంటే అధిక కేలరీలు లోపలికి పోయినట్లే. కనుక టొమాటో లేదా ఆనియన్ లేదా కుకుంబర్ లను డ్రింక్ తో తీసుకోండి. లేదా కొద్దిపాటి పొటాటో చిప్స్ బాగానే వుంటాయి. లేదంటే అసలు డ్రింక్ మానేయటం మంచిదే. డ్రింక్ చేస్తే చాలా ప్రమాదాలున్నాయి.

can diabetics take alcohol

మీ భోజనం మరచిపోయి లోషుగర్ స్ధాయికి చేరచ్చు. ఇక తాగితే మీ షుగర్ పరీక్షలకు కూడా అందదు. మీకు లోషుగర్ వచ్చిందని ఆహారం ఇవ్వాలని స్నేహితులకు కూడా తెలియకపోవచ్చు. అన్నిటికి మించి తాగి వాహనం నడిపితే మీరు ఎవరికైనా హాని కలిగించవచ్చు. పొగ‌ తాగితే ఇన్సులిన్ స్ధాయి పడిపోతుంది. కనుక వదిలేయాలి లేదా బాగా తగ్గించివేయాలి. ఏది ఏమైనప్పటికి పొగతాగటం గుండెకు, లంగ్స్ కు ప్రమాదం. స్మోకింగ్ అనేది వివిధ అవయవాలకు కేన్సర్ కలిగించే ప్రమాదముంది.

Admin