వీరమాచినేని : ఈ డైట్ లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. మాంసం తినని వారు ఈ డైట్‌ను ఫాలో కాలేరు. తెలిసిన వాళ్ళు ఈ పద్ధతిని అనుసరించిన తర్వాత కిడ్నీలో రాళ్లు వచ్చాయని చెప్పారు కాబట్టి ఒకవేళ మీరు పాటించేటట్లయితే అనుభవజ్ఞుల సహకారంతో ముందుకు వెళ్ళండి. మంతెన సత్యనారాయణ : ఉప్పు, కారం, నూనె అసలే వద్దంటారు. ఉప్పు మానేసిన తర్వాత ఒకాయన పూర్తిగా bp తక్కువ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. చెప్పేవన్నీ గుడ్డిగా ఎప్పుడూ ఫాలో కావద్దు. ఆయన చెప్పే దాంట్లో చాలా మంచి విషయాలు కూడా ఉంటాయి.
ఉదాహరణకు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి. పొట్టను ఎలా క్లీన్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ని ఏ డైట్ ద్వారా తగ్గించుకోవచ్చు. కనుక మీరు సొంతంగా ఆయన వీడియోలు చూసి ఫాలో కాకుండా స్వయంగా వాళ్ళ ఆశ్రమంలో జాయిన్ అయ్యి ఆ విషయాలు తెలుసుకుని పాటిస్తూ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుంటే ముందుకు వెళ్లాలి ఏ చిన్న ఇబ్బంది అనిపించినా వాళ్లకు తెలియజేయాలి.
డాక్టర్ ఖాదర్ వలీ: ఖాదర్ వలీ సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన అమెరికాలో సైంటిస్ట్ గా పనిచేసి ఇండియాకి తిరిగి వచ్చారు. అందరికన్నా ఉత్తమమైన డైట్ ఈయనదే అని నాకు అనిపించింది. క్యాన్సర్ వచ్చిన వాళ్లు కూడా ఈయన డైట్ తీసుకోవడం ద్వారా నయం చేసుకున్నారని చదివాను. ఈయన అపాయింట్మెంట్ దొరకడం కూడా చాలా కష్టం. ఫేస్‌బుక్‌లో ఈయన అనుచరులు నడిపించే గ్రూపులు ఉన్నాయి. అందులో మీ సమస్యను వివరిస్తే వాళ్లు మీకు ఎలాంటి ఆహారం తినాలో సూచిస్తారు. సమస్య చాలా తీవ్రమైనది అయితే ఆయనను స్వయంగా కలవడం మంచిది. ఖాదర్ వలీ దగ్గర ప్రతి సమస్యకు ఒక డైట్ ఉంది. అదేమీ మందు కాదు ఈ పద్ధతిని పాటించడం ద్వారా మనకు కొత్తగా వచ్చే సమస్యలు ఏమి ఉండవు.
నోట్: ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.