lifestyle

హై హీల్స్ ధ‌రిస్తున్నారా..? అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే..!

అందంగా వుండటం ఒక ఎత్తు అయితే, అందాల ప్రదర్శన మరింత ప్రాధాన్యతతో కూడుకున్నది. ఈ రెండో అంశానికి ఉదాహరణగా చెప్పాలంటే మన దేశ బాలీవుడ్ తారల రూప లావణ్యాలే. మహిళల ఎత్తులు పల్లాల ప్రదర్శన వారికి అసౌకర్యమైనప్పటికి చూసే వారికి ముచ్చటగా వుంటుంది. ఉదాహరణకు మహిళ అనువైన దుస్తులతోపాటు హై హీల్స్ వేస్తే…..రూపమే మారుతుంది. పిరుదులు, తొడలు బాగా కనపడి అపీలింగ్ గా వుంటాయి. మహిళలు కూడా హై హీల్స్ వేయటానికి ఎంతో ఇష్టపడతారు.

హై హీల్స్ ప్రయోజనాలు పరిశీలిస్తే.. అవి మహిళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. సన్నగాను, పొడవుగాను కనపడేలా చేస్తాయి. హై హీల్స్ వేస్తే చాలు మహిళలు తమ శారీరక సౌష్టవం మారిందని భావిస్తారు. బాలీవుడ్ సినీ తారల ఆకర్షణీయ రూపానికి వారి హై హీల్స్ కూడా ఒక కారణమని చెపుతారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే, హై హీల్స్ కాలి కండరాలకు, స్తనాలకు, పిరుదులకు మంచి రూపాన్నిస్తాయి. కాలి కండరాలు బలపడితే దాని ప్రభావం పిరుదులపై వుంటుంది. పిరుదులు బలపడాలంటే హై హీల్స్ వేసి నడవండి. మడమలలో బ్లడ్ సర్కులేషన్ కూడా పెరుగుతుంది.

if women are wearing high heels then know this

పెరిగిన రక్త సరఫరా గుండె కు కూడా మంచిది. పొట్ట కండరాలు, నడుము భాగం కూడా బలాన్ని సంతరించుకుంటాయి. మొదటి సారి వేసుకునేవారైతే, కాలి బెణుకులవంటివి రాకుండా ఇంటిలో నడక ప్రాక్టీస్ చేయాలి. వెన్ను నొప్పి వుంటే కొద్దిపాటి ఎత్తు అంటే సుమారు ఒకటిన్నర అంగుళాల ఎత్తున్న చెప్పులు వేసుకుంటే చాలు వెన్నునొప్పి తగ్గటం, కండరాల ఒత్తిడి తగ్గటం జరుగుతుంది. కనుక హై హీల్స్ వేయటం మంచిదే. అయితే ఇవి మరీ ఎత్తుగా అంటే 2 లేదా 3 అంగుళాలకు వుండ రాదు. శరీరం మంచి షేప్ కు రావాలంటే, కొద్ది రోజులు హై హీల్స్ మెయింటెయిన్ చేసినా పరవాలేదు. కానీ త‌ర‌చూ మాత్రం హై హీల్స్‌ను ధ‌రించ‌కూడ‌దు. కేవ‌లం పార్టీలు, ఫంక్ష‌న్ల స‌మ‌యంలో ధ‌రించ‌వ‌చ్చు.

Admin