హెల్త్ టిప్స్

Head Bath With Warm Water : చ‌లికాలంలో వేడి నీళ్ల‌తో త‌ల‌స్నానం చేయ‌వ‌చ్చా.. ఏమ‌వుతుంది..?

Head Bath With Warm Water : చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. నిద్ర లేవాలని అనిపించదు. స్నానం చేయాలని అనిపించదు. ఇలా, చలికాలంలో ఆ వాతావరణం వలన, మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము. పైగా బద్ధకం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయాలని ఎవరికీ అనిపించదు. కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా, వేడి నీటితోనే స్నానం చేస్తూ ఉంటారు. కానీ, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, వేడి నీటితో స్నానం చేయడం వలన, అనేక రకాల సమస్యలు కలుగుతాయి. చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తే ఏమవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. వేడి స్నానాలు చేయడం వలన, తల పొడిబారిపోతుంది.

దురదతో పాటుగా, వివిధ సమస్యలు కలుగుతుంటాయి. ఒకసారి, ఈ సమస్య వచ్చిందంటే దాని నుండి బయటపడటం కష్టమే. వేడి నీళ్లు జుట్టులోని హైడ్రోజన్ బంధాలని విచ్చిన్నం చేస్తాయి. 18 శాతం కంటే, ఎక్కువ జుట్టు దెబ్బ తినడానికి కారణం అవుతుంది. పైగా తలపై ఉన్న చర్మం పొడిగా మారిపోతుంది. హెయిర్ రూట్ బలహీనంగా మారిపోతుంది. చలికాలంలో వేడి నీటితో తలస్నానం చేయడం వలన, ఇలా రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. వేడి నీటి స్నానం వలన జుట్టు పాడవుతుంది.

can we do head bath with warm water in winter

తలపై వున్నా తేమ కూడా పోతుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వలన తలలో తేమని లాక్ చేస్తుంది. క్యూటికల్ మూసుకుపోతుంది. జుట్టు స్మూత్ గా తయారవుతుంది. తల స్నానం చేసేటప్పుడు, మీ అందమైన కురులు పాడైపోకుండా ఉండాలంటే, జుట్టుని డిస్టిల్డ్ వాటర్ తో క్లీన్ చేసుకోవడం మంచిది. హార్డ్ వాటర్ లో మెగ్నీషియం, క్యాల్షియం, ఖనిజాలు కలిగి ఉంటాయి.

దీంతో జుట్టుపై స్కాల్ప్ పై ప్రభావం పడుతుంది. ప్రతి రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తప్పకుండా షాంపూ తో తలస్నానం చేయడం మంచిది. జుట్టు జిడ్డుగా లేకుండా చూసుకోండి. మురికి వంటివి పేరుకు పోకుండా చూసుకోండి. చుండ్రు, దురద ఉన్నట్లయితే తలస్నానం రెగ్యులర్ గా చేస్తూ ఉండండి. ఇలా, మీరు తల స్నానం చేసినప్పుడు కనుక వీటిని పాటించినట్లయితే కచ్చితంగా జుట్టు బాగుంటుంది.

Admin

Recent Posts