Carrot Juice For Eye Sight : మనలో కొంత మందికి చూపు పక్క భాగంలో చక్కగా కనిపిస్తుంది. చూపు మధ్య భాగంలో స్పష్టంగా కనిపించదు. అలాగే చీకటిగా కూడా ఉంటుంది. ఇలా కనిపించడాన్ని మాక్యులర్ డిజెనరేషన్ అంటారు. కంటి గుడ్డు వెనుక భాగంలో ఉండే దానినే మాక్యులా అంటారు. మాక్యులాకు రక్తసరఫరా చేసే రక్తనాళాలు కుచించుకుపోవడం వల్ల కానీ, రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కానీ ఇలా మధ్య భాగంలో చూపు స్పష్టంగా కనిపించదు. అలాగే చూసేటప్పుడు స్ట్రెయిట్ గా ఉండే లైన్స్ కూడా వంకరగా కనిపిస్తాయి. అదే విధంగా వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు చక్కగా కనిపించకపోవడం, మనుషుల ముఖాలను గుర్తుపట్టకపోవడం వంటివి జరుగుతుంది. ఎక్కువగా షుగర్ వ్యాధితో బాధపడే వారిలో ఈ సమస్యను మనం ఎక్కువగా గుర్తించవచ్చు.
అలాగే అధిక రక్తపోటు కారణంగా నరాలు గట్టిపడి రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా జరగకపోవడం, నరాలు చిట్లిపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అలాగే హై స్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో ఇన్ ప్లామేషన్ వచ్చి మాక్యులాకు రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అలాగే అధిక బరువు వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే జన్యుపరంగా కూడా కొందరిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా ధూమపానం వల్ల కూడా రక్తప్రసరణ వ్యవస్థ దెబ్బతిని ఈ సమస్య తలెత్తవచ్చు. ఈ మాక్యులర్ డిజెనరేషన్ ను తగ్గించడంలో మనకు పచ్చి ఆహార పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే రోజుకు 400 నుండి 500 మిల్లీ గ్రాముల విటమిన్ సి శరీరానికి అందేలా చూసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఈ ఫ్యాటీ యాసిడ్లు ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో ఉపయోగపడతాయి. అదే విధంగా కంటి చూపును మెరుగుపరచడంలో మనకు లూటిన్, జియోస్ఘాంథిన్ ఎంతగానో సహాయపడతాయి. ఇవి రోజుకు మన శరీరానికి 6 నుండి 12 మిల్లీ గ్రాముల మోతాదులో అవసరమవుతాయి. ఇవి పాలకూరలో, పిస్తా పప్పులో, పచ్చి బఠాణీల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే జింక్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా మనం ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు. గుమ్మడి గింజల పప్పులో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఈ గింజలను నానబెట్టి తీసుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందవచ్చు. అలదే విధంగా రోజుకు రెండు పూటలా క్యారెట్ జ్యూస్ ను తీసుకోవాలి. ఈ విధమైన ఆహారాలను తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా మాక్యులర్ డిజెనరేషన్ అనే ఈ కంటి సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.