Coconut Water : వేసవి కాలంలో వేడి తీవ్రత నుండి బయట పడడానికి శీతల పానీయాలను అధికంగా సేవిస్తుంటారు. ఇవి మన శరీరానికి హానిని కలిగిస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు. శీతల పానీయాలలో షుగర్ అధికంగా ఉంటుంది. వీటిని తాగడం వల్ల బరువు పెరగడం, టైప్ 2 డయాబెటిస్, దంత క్షయం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వీటిని తాగకపోవడమే మనకు చాలా మంచిది. వేసవి కాలంలో ద్రవ రూపంలో శరీరానికి హాని కలిగించని పానీయాలను ఎక్కువగా తీసుకోవాలి. లేదంటే మన శరీరం డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయి.
సహజసిద్దంగా దొరికే కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇవి మనకు అందుబాటులో చాలా విరివిరిగా లభిస్తాయి. ఇవి మన దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. లేత కొబ్బరి కాయ నుండి తీసిన నీళ్లను తాగడం ద్వారా మాత్రమే మనకు మేలు జరుగుతుంది. కొబ్బరి నీళ్లు అనేకమైన విశిష్టమైన గుణాలను కలిగి ఉంటాయి. సోడియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్పరస్, మెగ్నియం వంటి మినరల్స్ ఉంటాయి. విటమిన్ బి, విటమిన్ సి కూడా కొబ్బరి నీళ్లలో ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
పొటాషియం అధికంగా కలిగి ఉన్న వాటిల్లో కొబ్బరి నీళ్లు ఒకటి. వీటిని తాగడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. చిన్న పిల్లల ఎదుగుదలకు కూడా కొబ్బరి నీళ్లు ఉపయోగపడతాయి. వీటిలో ఉండే కాల్షియం, ఐరన్ వంటి మినరల్స్ చిన్న పిల్లలు పొడుగు పెరగడంలో సహాయపడతాయి.
కొబ్బరి నీళ్లలో ఉండే జింక్, విటమిన్ సి లు దంత క్షయాన్ని తగ్గిస్తాయి. దీని వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె కండరాల పని తీరును కూడా కొబ్బరి నీళ్లు మెరుగుపరుస్తాయి. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వేసవి కాలంలో వచ్చే వ్యాధుల బారిన నుండి రక్షించుకోవచ్చు. మూత్రాశయ సంబంధిత వ్యాధులను కూడా కొబ్బరి నీళ్లు తగ్గిస్తాయి. వాంతులు, విరేచనాలు అధికంగా అయ్యే వారు కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరం కోల్పోయిన శక్తి తిరిగి లభిస్తుంది.
వాంతులు, విరేచనాలు కావడం వల్ల మన శరీరం సోడియం, పొటాషియంలను కోల్పోతుంది. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల ఈ మినరల్స్ తిరిగి శరీరానికి అందుతాయి. దీంతో తక్షణ శక్తి లభిస్తుంది. కాలేయం సంబంధిత వ్యాధులను కూడా కొబ్బరి నీళ్లు నయం చేస్తాయి. కొబ్బరి నీటిని నిల్వ చేయకూడదు. వీటిని నిల్వ చేయడం వల్ల వాటి సహజ గుణాన్ని కోల్పోతాయి. కొబ్బరి నీటిని తాజాగా ఉన్నప్పుడే తాగాలి. రోజుకు రెండు నుండి మూడు లీటర్ల కొబ్బరి నీళ్లను తాగవచ్చు. షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా వీటిని తాగవచ్చు. కానీ ఒకటి లేదా రెండు కొబ్బరి బోండాల కంటే ఎక్కువ తాగరాదు. అనేక ఔషధ గుణాలు కలిగినటువంటి కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.