Cinnamon Tea : ఒకే పదార్థాన్ని ఉపయోగించి టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ టీ ని తాగడం వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. అధిక బరువుతో బాధపడే వారు ఈ టీ ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ టీ ని తాగడం వల్ల ఒక్క నెలల్లోనే 5 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా ఈ టీ ని తాగడం వల్ల మనం అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ టీ ని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అదే విధంగా ఈ టీని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది.
అంతేకాకుండా దీనిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు మనల్ని ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయి. శరీరంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో అలాగే స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా ఈ టీ మనకు సహాయపడుతుంది. బరువు తగ్గడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ టీ ని ఎలా తయారు చేసుకోవాలి…దీనిని తయారు చేయడానికి కావల్సిన ఆ ఒకే ఒక్క పదార్థం ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టీ ని తయారు చేసుకోవడానికి గానూ మనం ఉపయోగించాల్సిన పదార్థం దాల్చిన చెక్క. ఇది దాదాపు ప్రతి ఒక్కిర ఇంట్లో ఉంటుంది. మసాలా వంటల్లో దీనిని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. వంటలకు రుచిని ఇవ్వడంతో పాటు దాల్చిన చెక్క మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడంలోనూ దోహదపడుతుంది.
దాల్చిన చెక్క టీ ని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ టీ ని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో 200 ఎమ్ ఎల్ నీళ్లు పోసి బాగా వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసి మధ్యస్థ మంటపై నీటిని మరిగించాలి. ఇలా పది నిమిషాల పాటు మరిగించిన తరువాత ఈ టీ ని వడకట్టి కప్పులోకి తీసుకోవాలి. ఇందులో రుచి కొరకు ఒక టీ స్పూన్ తేనె కలుపుకుని తీసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన టీ ని రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల మనం వేగంగా బరువు తగ్గవచ్చు. అయితే బరువు తగ్గాలనుకునే వారు ఈ టీని తాగుతూనే రోజూ నీటిని ఎక్కువగా తాగాలి. ప్రతిరోజూ గంట వ్యాయామం చేయాలి. పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ ను, ప్రాసెస్ట్ ఫుడ్ ను తీసుకోకూడదు. ఈ నియమాలను పాటిస్తూ దాల్చిన చెక్క టీ ని తాగడం వల్ల చాలా సులభంగా అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చని అలాగే చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.