Almonds Sabja Seeds Drink : చ‌ల్ల చ‌ల్ల‌ని స్పెష‌ల్ డ్రింక్‌.. త‌యారీ ఇలా.. శ‌క్తికి శ‌క్తి, ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Almonds Sabja Seeds Drink : మ‌నకు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో డ్రింక్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు. అలాగే ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. దీనిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. మ‌న‌కు అందుబాటులో ఉండే ప‌దార్థాల‌తో చేసుకునే ఈ హెల్తీ డ్రింక్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

హెల్తీ డ్రింక్ త‌యారీకి కావల్సిన పదార్థాలు..

పాలు – అర లీట‌ర్, నాన‌బెట్టిన బాదంప‌ప్పు -20, క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ – ఒక టేబుల్ స్పూన్, పంచ‌దార – 4 టేబుల్ స్పూన్స్, త‌రిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, నాన‌బెట్టిన స‌బ్జా గింజ‌లు -ఒక టేబుల్ స్పూన్.

Almonds Sabja Seeds Drink recipe in telugu very healthy and tasty
Almonds Sabja Seeds Drink

హెల్తీ డ్రింక్ త‌యారీ విధానం..

ముందుగా బాదంప‌ప్పుపై ఉండే పొట్టును తీసేసి బాదం గింజ‌ల‌ను ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్, పావు క‌ప్పు నీళ్లు పోసి ప‌లుకులు లేకుండా మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో పాలు పోసి వేడి చేయాలి. పాలు పొంగు వ‌చ్చిన త‌రువాత ఇందులో మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. త‌రువాత ఇందులో యాల‌కుల పొడి, పంచ‌దార‌, డ్రై ఫ్రూట్స్ వేసి క‌ల‌పాలి. ఈ పాల‌ను 4 నిమిషాల పాటు క‌లుపుతూ మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత స‌బ్జా గింజ‌లు వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న డ్రింక్ ను రెండు గంట‌ల పాటు ఫ్రిజ్ లో ఉంచి చ‌ల్లగా అయిన త‌రువాత తీసుకోవ‌చ్చు లేదా ఐస్ క్యూబ్స్ వేసి అప్ప‌టిక‌ప్పుడు కూడా తీసుకోవ‌చ్చు. ఈ విధంగా పాలు, బాదంప‌ప్పుతో డ్రింక్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts