హెల్త్ టిప్స్

Rice Cooking : ఇలా అన్నం వండి తింటే.. అస్సలు బరువు పెరగరు..!

Rice Cooking : చాలామంది, రకరకాల అనారోగ్య సమస్యలు కారణంగా బాధపడుతుంటారు. ఎక్కువ మంది అధిక బరువు వలన కూడా ఇబ్బంది పడుతుంటారు. ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. అయితే, బరువు తగ్గాలని చాలామంది రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అధిక బరువు సమస్య వలన, అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అన్నం ఇలా వండి తింటే, బరువు పెరగరు.

బరువు పెరగకుండా ఉండాలనుకునే వాళ్ళు, అన్నాన్ని ఈ విధంగా వండి తింటే మంచిది. ఆయుర్వేదం ప్రకారం, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు, అన్నం తినకూడదని చెప్తూ ఉంటారు. బరువు తగ్గాలన్నా, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు వున్నా, అన్నం తినొచ్చు.

cook rice like this and eat you will never get weight

అందులో తప్పేమీ లేదు. అయితే, కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఇలా అన్నం తింటే, బియ్యం లో గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు. బియ్యం కార్బోహైడ్రేట్స్ కి మూలం. శరీరానికి శక్తిని ఇస్తుంది. ఐరన్, మెగ్నీషియం, పొటాషియంతో పాటుగా ఇతర పోషకాలు కూడా అన్నంలో ఉంటాయి. సోడియం కూడా ఉంటుంది. బియ్యం లో ఫైబర్ కూడా ఉంటుంది. రక్తంలో చక్కెరని కంట్రోల్ చేస్తుంది కూడా. బియ్యాన్ని వండే ముందు, వాటిని డ్రై రోస్ట్ చేయాలి. ఇలా రైస్ ని స్టోర్ చేసి మీరు పెట్టుకోవచ్చు. దీని వలన రుచి పెరుగుతుంది పైగా స్టార్చ్ కూడా తగ్గుతుంది.

అన్నం మెత్తగా అయిపోకుండా పొడిపొడిగా వస్తుంది. వేయించిన బియ్యాన్ని ఒక కప్పు రైస్ కి నాలుగు కప్పులు నీళ్లు పోసి, ఒక టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసి కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత ఎక్కువగా ఉన్న నీటిని తీసేయాలి వీటిని మీరు గంజిలా తాగొచ్చు. లేదంటే సూప్ లాగ చేసుకోవచ్చు. అన్నంని పప్పు, కూరలతో మీరు తినొచ్చు. ఈ విధంగా మీరు అన్నం వండి తీసుకుంటే, బరువు పెరగరు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా కలగవు.

Admin

Recent Posts