హెల్త్ టిప్స్

కొత్తిమీర జ్యూస్‌ను పరగడుపునే తాగాల్సిందే.. ఎందుకో తెలుసా ?

కొత్తిమీరను నిత్యం మనం వంటల్లో వేస్తుంటాం. అనేక రకాల కూరల్లో కొత్తిమీరను వేస్తుంటారు. దీంతో చట్నీ, కూరలు చేసుకోవచ్చు. అయితే కొత్తిమీరను పోషకాలకు గని అని చెప్పవచ్చు. రోజూ పరగడుపునే ఒక కప్పు కొత్తిమీర జ్యూస్‌ను తాగితే అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కొత్తిమీర జ్యూస్‌ను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు. ఈ సీజన్‌లో సహజంగానే అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కనుక ఈ జ్యూస్‌ను తాగితే మంచిది.

2. కొత్తిమీరలో ఐరన్‌ అధికంగా ఉంటుంది. కనుక రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది.

coriander leaves juice must take it daily know why

3. గాయాలు, పుండ్లు అయినవారు రోజూ కొత్తిమీర జ్యూస్‌ను తాగుతుంటే అవి త్వరగా మానుతాయి.

4. కొత్తిమీర జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది.

5. కొత్తిమీర జ్యూస్‌ను తాగితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. ఆర్థరైటిస్‌ నొప్పులు తగ్గుతాయి.

6. దంతాలు, చిగుళ్లు దృఢంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.

Admin

Recent Posts