Coriander Leaves Water For Kidneys : మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. మూత్రపిండాలు మన శరీరంలో ఎన్నో ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. మన శరీరంలో ఉండే వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటే మన శరీరం కూడా అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. నేటి తరుణంలో మారిన మన ఆహారపు అలవాట్ల కారణంగా, జీవన విధానం కారణంగా చాలా మంది మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ప్రధానకారణం మూత్రపిండాల్లో వ్యర్థాలు, మలినాలు ఎక్కువగా పేరుకుపోవడమే.
నీటిని తక్కువగా తాగడం, ఉప్పు ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, మద్యపానం వంటి వివిధ కారణాల చేత మూత్రపిండాల్లో విష పదార్థాలు ఎక్కువగా పేరుకుపోతున్నాయి. దీంతో మూత్రపిండాలకు సంబంధించిన అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి సమస్యలు మనకు రాకూడదంటే మనం ఎల్లప్పుడూ మూత్రపిండాలను ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మూత్రపిండాల్లో మలినాలు , విష పదార్థాలు పేరుకుపోకుండా చూసుకోవాలి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే నీటిని ఎక్కువగా తాగడంతో పాటు మన ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితో పాటు ఒక పానీయాన్ని తయారు చేసి తీసుకోవాలి.
ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో ఉండే మలినాలు, విష పదార్థాలు అన్నీ తొలగిపోతాయి. మూత్రపిండాలు శుభ్రంగా ఉంటాయి. మూత్రపిండాలను శుభ్రపరిచే ఈ పానీయాన్ని తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో కొన్ని కొత్తిమీర ఆకులను కాడలతో చేసి వేసి వేడి చేయాలి. వీటిని 10 నిమిషాల పాటు ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారనివ్వాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గ్లాస్ లో పోసుకుని తాగాలి. ఇలా నెలకు రెండు సార్లు తాగడం ఒక గ్లాస్ మోతాదులో కొత్తిమీర నీటిని తాగడం వల్ల మూత్రపిండాల్లో పేరుకుపోయిన విష పదార్థాలన్నీ తొలగిపోతాయి. మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్న వారు, గర్భిణీ స్త్రీలు ఈ నీటిని తాగకపోవడమే మంచిది. ఈ విధంగా కొత్తిమీర నీటిని తాగడం వల్ల మనం ఎల్లప్పుడూ మూత్రపిండాలను ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.