Cumin Powder : అధిక బరువు.. ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో ఇది కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ అధిక బరువుతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. అధిక బరువు వల్ల మనం అనేక ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత, షుగర్, బీపీ, థైరాయిడ్, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పులు, గుండె జబ్బులు ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడానికి ప్రధాన కారణం అధిక బరువే. కనుక మనం ఈ సమస్య నుండి వీలైనంత త్వరగా బయట పడడం ఎంతో ముఖ్యం. అధిక బరువుతో బాధపడే వారు కేవలం ఒకే ఒక పదార్థాన్ని ఉపయోగించి చాలా సులభంగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
ఈ పదార్థాన్ని వాడడం వల్ల బరువు తగ్గడంతో పాటు మనం అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అధిక బరువును తగ్గించే ఆ పదార్థం గురించి దీని వల్ల మనకుయకలిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువును తగ్గించడంలో జీలకర్ర మనకు ఎంతగానో సమాయపడుతుంది. జీలకర్ర ఉండని వంట గది ఉండదనే చెప్పవచ్చు. మనం చేసే ప్రతి వంటలో దీనిని ఉపయోగిస్తాము. జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు కూడా సూచిస్తున్నారు. జీలకర్రను ఉపయోగించడం వల్ల అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు.
అధిక బరువుతో బాధపడే 80 మందిపై ఇరాన్ శాస్త్రవేత్తలు మూడు నెలల పాటు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. జీలకర్రను తీసుకోవడం వల్ల శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరగడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. జీలకర్రలో ఎపిజినిన్, లుటియోనిన్ అనే రెండు రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కొవ్వు కణాలల్లో ఇన్ ప్లామేషన్ ను తగ్గించి కొవ్వు కరిగేటట్టు చేయడంలో ఎంతో సహాయపడతాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. అధిక బరువుతో బాధపడే వారు రోజూ 3 గ్రాముల జీలకర్రను మూడు నెలల పాటు తీసుకోవడం వల్ల మనం బరువు తగ్గడంతో పాటు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయని వారు చెబుతున్నారు.
అధిక బరువుతో బాధపడే వారు జీలకర్రను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం వంటల్లో జీలకర్రను వాడినప్పటికి దీనిని నూనెలో వేయించడం వల్ల వాటిలో ఉండే పోషకాలన్నీ కూడా నశిస్తాయి. కనుక జీలకర్రను దోరగా వేయించి పొడిగా చేసుకుని వాడాలి. ఈ జీలకర్ర పొడిని సలాడ్స్, మొలకెత్తించిన విత్తనాలపై చల్లి తీసుకోవాలి. అలాగే జీలకర్రను నోట్లో వేసి బాగా నమిలి తీసుకోవచ్చు. వీటితో కషాయాన్ని తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా జీలకర్రను ఉపయోగించడం వల్ల అధిక బరువు సమస్య నుండి చాలా తేలికగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.