Multi Grain Methi Masala Puri : మనం అల్పాహారంగా తయారు చేసుకునే వంటకాల్లో పూరీలు కూడా ఒకటి. పూరీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం చాలా సులభం. అలాగే వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మనం ఈ పూరీలను మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. మెంతికూరతో పాటు మల్టీ గ్రెయిన్స్ పిండిని వాడి చేసే ఈ మసాలా పూరీలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి రెండు తింటే చాలు మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ మల్టీ గ్రెయిన్ మేతి మసాలా పూరీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మల్టీ గ్రెయిన్ మేతి మసాలా పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
సజ్జ పిండి – అర కప్పు, గోధుమపిండి – అర కప్పు, ఉప్పు – తగినంత, శనగపిండి – 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, కారం -అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, నువ్వులు – 2 టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – పావు టీ స్పూన్, మెంతికూర ఆకు – అర కట్ట, పుల్లటి పెరుగు – అర కప్పు, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
మల్టీ గ్రెయిన్ మేతి మసాలా పూరీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో సజ్జ పిండి, గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్ని వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుని పూరీ పిండిలా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని నూనె రాస్తూ పూరీ ప్రెస్ తో లేదా చపాతీ కర్రతో పూరీలను వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పూరీలను వేసి వేయించాలి. ఈ పూరీలను రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా పూరీ తయారవుతుంది. వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ పూరీలు సాధారణ పూరీల లాగా పొంగవు. వీటిని నేరుగా ఇలాగే తినవచ్చు లేదా ఏదైనా మసాలా కూరతో కూడా తినవచ్చు.