హెల్త్ టిప్స్

Cumin Water : రోజూ ప‌ర‌గ‌డుపునే జీల‌క‌ర్ర నీటిని తాగితే.. ఇన్ని ప్ర‌యోజ‌నాలా..?

Cumin Water : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి జీల‌క‌ర్ర‌ను వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. దీన్ని వంట‌ల్లో నేరుగా వేస్తారు. లేదా వేయించి పొడిగా కూడా ఉపయోగిస్తారు. జీల‌క‌ర్ర వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు ఈ నీటిని త‌ప్ప‌క తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జీల‌క‌ర్ర నీటిని ఉద‌యాన్నే తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా ఉండే కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. న‌డుము వ‌ద్ద ఉండే కొవ్వు పూర్తిగా కరిగి స‌న్న‌గా మారుతారు. దీంతోపాటు కిడ్నీ స్టోన్లు కూడా కరిగిపోతాయి. అలాగే జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం త‌గ్గుతాయి. జీర్ణాశ‌యం, పేగుల్లో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. దీంతో జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్రంగా మారుతుంది. శ‌రీరంలో ఉండే విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు పోతాయి.

cumin water on empty stomach many wonderful benefits

జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల మాన‌సిక స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. డిప్రెష‌న్‌, ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. దీంతో మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త కలుగుతుంది. రాత్రి పూట చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు. అలాగే నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. దీంతో డ‌యాబెటిస్ నుంచి విముక్తి ల‌భిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా త‌గ్గుతాయి. దీని వ‌ల్ల హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసుకోవ‌చ్చు. అయితే జీల‌క‌ర్ర నీటిని ఒక క‌ప్పు మోతాదులోనే తాగాలి. రెండు క‌ప్పుల నీళ్ల‌ను పోసి అందులో ఒక టీస్పూన్ జీల‌క‌ర్రను వేసి ఒక క‌ప్పు నీళ్లు అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత నీళ్ల‌ను వ‌డ‌క‌ట్టి గోరువెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి. తాగిన త‌రువాత 30 నిమిషాల పాటు ఏమీ తిన‌రాదు. ఇలా రోజూ క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో తాగ‌డం వ‌ల్ల పైన తెలిపిన లాభాలు అన్నింటినీ పొంద‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts