Dates Milk Drink : మన ఇంట్లో ఉండే పదార్థాలతో పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ పానీయాన్ని తాగడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ పానీయాన్ని రోజూ తాగడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల నరాలు, కండరాలు బలంగా తయారవుతాయి. శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది. నీరసం, అలసట, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. మనం రోజంతా ఉత్సాహాంగా పని చేసుకోగలుగుతాము.
బలహీనంగా ఉండే వారు ఈ పానీయాన్ని తాగడం వల్ల బలంగా, పుష్టిగా తయారవుతారు. అంతేకాకుండా ఈ పానీయాన్ని తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. వయసుపై బడడం వల్ల వచ్చే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే రక్తహీనత సమస్య తగ్గుతుంది. పిల్లలకు ఈ పానీయాన్ని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ కూడా చక్కగా అందుతాయి. చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ పానీయాన్ని తయారు చేసుకోవడం చాలా సులభం. ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి… ఎప్పుడు తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం అర లీటర్ పాలను, 10 ఖర్జూర పండ్లను, 10 బాదంపప్పును, 8 జీడిపప్పును, పటిక బెల్లాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఖర్జూర పండ్లల్లో ఉండే గింజలను తీసేసి రాత్రంతా నానబెట్టాలి. తరువాత బాదంపప్పును, జీడిపప్పును బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో నానబెట్టిన ఖర్జూర పండ్లు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అర లీటర్ పాలను పోసి వేడి చేయాలి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసి పాలను మరిగించాలి.
పాలు పొంగు వచ్చిన ఖర్జూర పండ్ల పేస్ట్, పొడి చేసుకున్న బాదంపప్పు, జీడిపప్పు వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత మధ్య మధ్యలో కలుపుతూ మరో 5 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాలు మరింత రుచిగా ఉండాలనుకునే వారు ఇందులో పటిక బెల్లం వేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న పాలను రోజూ ఉదయం లేదా రాత్రి పూట తీసుకోవాలి. ఈ విధంగా పాలను తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని అనేక అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.