Potato For Hair : ప్రతి ఒక్కరు కూడా అందమైన కురులని సొంతం చేసుకోవాలని అనేక రకాల చిట్కాలని పాటిస్తూ ఉంటారు. మీరు కూడా అందమైన కురులని పొందాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. జుట్టు దృఢంగా ఎదగాలన్నా, జుట్టు రాలిపోకుండా ఒత్తుగా పెరగాలన్నా ఈ చిట్కా మీకు బాగా పనిచేస్తుంది. ఇదేం పెద్ద ఖరీదైనది కాదు. పైగా మనం వీటిని తెలియక పారేస్తూ ఉంటాము. పారేసే వాటి బదులు మనం జుట్టుకి వాడితే సరిపోతుంది. జుట్టు బాగా పెరుగుతుంది.
బంగాళదుంపల్లో పోషకాలు ఆరోగ్యానికే కాదు కురుల ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. అందమైన కురులని పొందాలనుకుంటే బంగాళదుంపని ఇలా ఉపయోగించండి. మనం బంగాళదుంప ముక్కల్ని కోసినప్పుడు తొక్కలు తీసేస్తూ ఉంటాము. ఆ తొక్కలన్నింటిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోయండి. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టి ఆ తొక్కల్ని మరిగిస్తూ ఉండండి. ఈలోగా ముక్కల్ని కట్ చేసుకోండి. బంగాళదుంపల ముక్కలు అన్నింటినీ మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
ఇప్పుడు బంగాళదుంప ముద్దని వడకట్టుకోండి. బంగాళదుంప రసం మనకి కావాలి. పిప్పి అక్కర్లేదు. ఇప్పుడు ఆ రసంలో ఒక గుడ్డుసొన వేసుకోవాలి. ఇందులోనే కొంచెం తేనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీనిని మీరు ఒక దానిలో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.
మీరు వారానికి రెండు సార్లు దీన్ని వాడచ్చు. ఇందాక బంగాళదుంప తొక్కల్ని మరిగించుకున్నారు కదా.. వాటిని కూడా మీరు వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ తొక్కల రసం జుట్టును దృఢంగా మార్చగలదు. జుట్టు రాలకుండా చూస్తుంది. ఈ నీళ్ళని మీరు ఒక స్ప్రే బాటిల్ లో వేసుకుని, స్ప్రే చేసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.