vastu

Wife And Husband : భార్యాభ‌ర్త‌లు రాత్రి స‌మ‌యంలో ఇలా నిద్రించాలి..!

Wife And Husband : రాత్రిపూట నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు. ముఖ్యంగా భార్యా భర్తలు రాత్రి నిద్ర పోయేటప్పుడు పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. భార్యాభర్తలు రాత్రి సమయంలో ఈ విధంగా నిద్రిస్తే మంచిది. ఈ పొరపాట్లని మాత్రం అస్సలు చేయకుండా చూసుకోండి. భార్యా భర్తలు నిద్రపోయేటప్పుడు మంచం గోడకి తాకకుండా నాలుగు వైపులా కూడా కొంత ఖాళీ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చేస్తే భార్యాభర్తలకి మంచి జరుగుతుంది.

మంచం కుడివైపున భర్త, ఎడమవైపు భార్య నిద్ర పోవాలి. రాత్రిపూట మీకు చాలా సార్లు మెళ‌కువ వస్తున్నట్లయితే, మీరు కచ్చితంగా నిద్ర వాతావరణాన్ని మెరుగుపరచుకోవాలి. వాస్తు ప్రకారం చూసుకున్నట్లయితే, పెళ్లయిన వాళ్లు తలని దక్షిణం, నైరుతి వైపు పెట్టుకోవాలి. దానధర్మాలు చేయకపోయినా దక్షిణం వైపు తలపెట్టి నిద్రించాలని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలా అనుసరించడం మంచిది.

couple must sleep like this according to vastu

నిద్రపోయేటప్పుడు ఉత్తరం వైపు తల పెట్టుకుని అసలు నిద్రపోకూడదని చెప్తున్నారు పండితులు. ఉదయం లేవగానే ఉదయిస్తున్న సూర్యనారాయణని చూస్తే మంచిది. భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పని మీద బయటికి వెళ్లినప్పుడు కానీ వెంటనే ఇల్లు ఊడవడం మంచిది కాదు. కడగడం, తుడవడం వంటివి చేయకూడదు. తల స్నానం చేయడం కూడా మంచిది కాదు.

కాబట్టి ఈ తప్పుల్ని అస్సలు చేయకండి. కొత్తగా పెళ్లయిన జంట పెద్ద వాళ్ళతో ఉంటున్నట్లయితే, దంపతులకు వాయువ్యంలో గది ఉండేటట్టు చూసుకోవాలి. ఈశాన్య దిశలో పడకగదిని నివారించండి. సంతానం పొందాలనుకునే భార్యా భర్తలు ఆగ్నేయ ముఖంగా ఉన్న గదిలో నిద్రపోవడం మంచిది. ఇలా భార్యాభర్తలు నిద్రపోయేటప్పుడు కచ్చితంగా ఈ నియమాలని పాటించాలి. అప్పుడు భార్య భర్తల మధ్య బంధం బాగుంటుంది. ప్రేమానురాగాలు బలపడతాయి.

Admin

Recent Posts