హెల్త్ టిప్స్

Cooking Chicken : చికెన్ ని వండేటప్పుడు.. ఈ పొరపాట్లను అస్సలు చెయ్యకండి..!

Cooking Chicken : చాలా మంది, చికెన్ లేకపోతే అన్నం తినరు. రోజు చికెన్ ఉండాలని, చాలా మంది వండే వరకు కూడా, భోజనానికి రారు. చికెన్ అంటే చాలా మందికి ప్రాణం. చికెన్ ని తినకపోతే, అసలు ఉండలేరు. అయితే, చికెన్ ని వండేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకుండా చూసుకోండి. ఈ పొరపాట్లను చేస్తే చికెన్ అసలు బాగోదు. చికెన్ సరిగ్గా వండితే మృదువుగా ఉంటుంది. రుచిగా కూడా ఉంటుంది.

చికెన్ తక్కువ ఉడికినా లేదంటే ఎక్కువ ఉడికినా అది తినలేము. చికెన్ ఎక్కువగా ఉడకబెట్టడం వలన, అది బాగా సాగుతుంది. సో, సరిగ్గా ఉడక పెట్టుకోవడం చాలా ముఖ్యమైన విషయం. చికెన్ కొనడం నుండి వండడం వరకు, ఈ పొరపాట్లను అస్సలు చేయకుండా చూసుకోండి. చికెన్ ని కొనేటప్పుడు బోన్ లెస్ చికెన్ ముక్కల్ని కాకుండా బోన్ ఇన్ చికెన్ ని కొనండి. అప్పుడే బాగుంటుంది.

do not make these mistakes while cooking chicken

మీరు చికెన్ ని వండేటప్పుడు కచ్చితంగా చికెన్ ని కడగండి. చికెన్ ని కడగడం వలన దానిలోని బ్యాక్టీరియా చనిపోతుంది అని అనుకుంటారు అంతా. కానీ, చికెన్ కడగడం లేదంటే నానబెట్టడం వలన బ్యాక్టీరియా పోదు. చికెన్ ని ఉడకపెట్టినపుడు మాత్రమే పోతుంది. చికెన్ వండేటప్పుడు, చికెన్ ని ఉడికించే ముందు ఉప్పు నీటి లో చికెన్ ని నానబెట్టి తర్వాత చక్కెర నీళ్లని జోడించి చేయాలి.

ఇది చికెన్ లో తేమను నిలుపుకోవడానికి సహాయం చేస్తుంది. చికెన్ రుచిగా వండాలని అనుకుంటే, కొన్ని మసాలాలు, పెరుగు, నిమ్మరసం లేదంటే ఇతర పదార్థాలతో మ్యారినేట్ చేయండి. చికెన్ మసాలా క్రీమీ లుక్ ని అందరూ ఇష్టపడుతుంటారు. చికెన్ స్కిన్ మాంసం యొక్క తేమ ని నిలుపుతుంది. చికెన్ వెలుపల మంచిగా పెళుసుగా లోపల మృదువుగా ఉంటుంది. చికెన్ ని సమాన ముక్కల్లో కట్ చేసుకోవాలి. అలానే సమానంగా ఉడికించుకోవాలి. చికెన్ వండేటప్పుడు, పాన్ మూత పెట్టాలి. ఇలా మూత పెట్టడం వలన,డ్రై అవ్వదు.

Admin

Recent Posts