Tea : టీ తాగేట‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తీసుకోకండి..!

Tea : రోజూ ఉద‌యాన్నే వేడి వేడిగా టీ గొంతులో ప‌డ‌క‌పోతే కొంద‌రికి ఏమీ తోచ‌దు. అస‌లు రోజు ప్రారంభం అయిన‌ట్లు ఉండ‌దు. కొంద‌రు రోజూ బెడ్ టీతోనే త‌మ రోజువారి దిన‌చ‌ర్య‌ను మొద‌లు పెడ‌తారు. టీ అంటే చాలా మందికి ఇష్ట‌మే. ఇందులోనూ అనేక ర‌కాలు ఉన్నాయి. అయితే టీ తాగే స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను తీసుకోరాదు. లేదంటే స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే..

do not take these foods while drinking tea
Tea

1. ఉల్లిపాయ‌ల‌ను ప‌చ్చిగా తిని ఆ త‌రువాత టీ తాగ‌రాదు. తాగితే జీర్ణాశ‌యంలో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కొంద‌రిలో అల‌ర్జీలు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అలాగే ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్డు, స‌లాడ్‌, మొల‌క‌లు తిని కూడా టీ తాగ‌రాదు. లేదంటే జీర్ణ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

2. నిమ్మ‌ర‌సం తాగిన త‌రువాత కూడా టీ తాగ‌రాదు. తాగితే క‌డుపులో విప‌రీత‌మైన మంట వచ్చే అవ‌కాశాలు ఉంటాయి. అలాగే కొంద‌రిలో విరేచ‌నాలు కూడా కావ‌చ్చు. క‌నుక ఈ విధంగా చేయ‌రాదు.

3. కొంద‌రు శ‌న‌గ‌పిండితో త‌యారు చేసిన చిరుతిళ్ల‌ను తిన్నాక లేదా తింటూ టీ తాగుతారు. వాస్త‌వానికి ఇలా చేయ‌కూడ‌దు. వాటిని తింటూ లేదా తిన్నాక టీ తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు న‌ష్టం జ‌రుగుతుంది. అలాగే మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శరీరం స‌రిగ్గా శోషించుకోలేదు. క‌నుక ఈ విధంగా తిన‌రాదు.

4. ప‌సుపును లేదా దాంతో త‌యారు చేసే ప‌దార్థాల‌ను తిన్న వెంట‌నే కూడా టీ తాగరాదు. తాగితే జీర్ణ‌వ్య‌వ‌స్థలో ఇబ్బందులు వ‌స్తాయి. అజీర్ణం, గ్యాస్ వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి.

5. టీ తాగక ముందే నీటిని తాగాలి. కానీ టీ తాగిన త‌రువాత నీళ్ల‌ను తాగ‌రాదు. ఒక వేళ తాగితే జీర్ణ‌క్రియ‌కు ఆటంకం ఏర్ప‌డుతుంది. అలాగే గ్యాస్ వ‌స్తుంది. క‌నుక టీ తాగ‌క‌ముందే నీళ్ల‌ను తాగాలి.

Share
Admin

Recent Posts