Sweets : తీపి ప‌దార్థాల‌ను తిన్న వెంట‌నే నీళ్ల‌ను తాగ‌కండి.. ఎందుకంటే..?

Sweets : మ‌నం రోజూ వారి జీవితంలో తెలిసి తెలియ‌క కొన్ని పొర‌పాట్లు చేస్తూ ఉంటాము. ఈ పొర‌పాట్ల వ‌ల్ల మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తూ ఉంటుంది. అలాగే వీటి కార‌ణంగా మ‌నం జీవితాంతం బాధ‌ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటుంది. ఇలా మ‌నం చేసే పొర‌పాట్ల‌ల్లో ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న‌లో చాలా మంది తీపి ప‌దార్థాల‌ను ఇష్టంగా తింటారు. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా తీపి ప‌దార్థాల‌ను, స్వీట్ ల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. ఏ ఆహార ప‌దార్థానైనా తిన్న త‌రువాత మ‌నం నీటిని తాగుతూ ఉంటాము. ఇది స‌హ‌జ‌మే. అయితే తీపి ప‌దార్థాల‌ను తిన్న త‌రువాత మాత్రం నీటిని తాగ‌కూడ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు.

తీపి ప‌దార్థాల‌ను తిన్న త‌రువాత నీటిని తాగితే అదే మ‌నం చేసే అతి పెద్ద పొర‌పాటు అవుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. స‌హ‌జంగా తీపి ప‌దార్థాలను తిన్న త‌రువాత నీటిని తాగాల‌నిపిస్తుంది. దీంతో మ‌నం నీటిని తాగుతాము. ఇలా తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు మ‌రింత వేగంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. సాధార‌ణంగా తీపిని తిన్న త‌రువాత ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఇలా తీపి ప‌దార్థాలు తిన్న త‌రువాత నీటిని తాగితే నీటి ద్వారా గ్లూకోజ్ మ‌రింత ఎక్కువ‌గా శోషించ‌బ‌డుతుంద‌ని దీంతో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు మ‌రింత వేగంగా పెరుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. తీపి ప‌దార్థాల‌ను తిన్న త‌రువాత నీటిని తాగ‌డం వ‌ల్ల టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు మ‌రింత ఎక్కువ‌గా ఉంటాయ‌ని వారు చెబుతున్నారు.

do not take water right after eating Sweets know why
Sweets

ముఖ్యంగా షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు తీపి ప‌దార్థాల‌ను తిన్న త‌రువాత అస్స‌లు నీటిని తాగ‌కూడ‌ద‌ని వారు చెబుతున్నారు. ఒక‌వేళ తీపి ప‌దార్థాల‌ను తిన్న త‌రువాత నీటిని తాగాల‌నిపిస్తే నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి. లేదంటే నోట్లో ఏదైనా ల‌వ‌ణాన్ని వేసుకోవాలి. అలాగే నీటిని బ‌దులుగా పండ్ల ర‌సాల‌ను తాగ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. తీపి ప‌దార్థాల‌ను తిన్న అర‌గంట నుండి ముప్పావు గంట త‌రువాత మాత్ర‌మే నీటిని తాగాలని అప్పుడే శ‌రీరానికి ఎటువంటి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts