Coriander Seeds : మనం రోజూ రకరకాల వంటలు చేస్తూ ఉంటాం. మనం చేసే వంటలకు రుచి పెరగడానికి మసాలా దినుసులను ఉపయోగిస్తూ ఉంటాం. అందులో ఒకటి ధనియాలు. ధనియాల పొడి వేయనిదే వంట పూర్తి అవ్వదు అని చెప్పవచ్చు. భారతీయులు చాలా కాలం నుండి ధనియాలను తమ వంటల్లో వాడుతున్నారు. ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్రకారం ధనియాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మనం ధనియాలను నేరుగా లేదా పొడిలా ఏవిధంగా అయినా ఉపయోగించుకోవచ్చు. ధనియాల నూనె కూడా మనకు మార్కెట్ లో లభిస్తుంది. ధనియాల వల్ల కలిగే ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. మన శరీర మెటబాలిజాన్ని పెంచి కొవ్వును కరిగించే పదార్థాలను తీసుకోవడం వల్ల మనం అధిక బరువు సమస్య సుండి బయట పడవచ్చు. బరువు తగ్గాలి అనుకునే వారికి ధనియాలు ఎంతగానో ఉపయోగపడతాయి. 3 టీస్పూన్ ల ధనియాలను కనీసం 3 గంటలు నీళ్లలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన ధనియాలను ఒక గ్లాసు నీటిలో వేసి సగం గ్లాసు నీళ్లు అయ్యే వరకు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి రోజుకు రెండు సార్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు.
2. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు తరచూ ధనియాలను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వీటిల్లో అధికంగా ఉండే విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ధనియాల టీ లేదా నీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత నుండి బయట పడవచ్చు.
3. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ధనియాలు ఎంతగానో సహాయపడతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి కూడా ధనియాలు ఉపయోగపడతాయి.
4. చర్మ సమస్యలను కూడా ధనియాలు తగ్గిస్తాయి. దద్దుర్లు, దురదలు, వాపులను తగ్గించడంలో ధనియాలు ఎంతో సహాయపడతాయి. ఒక టీ స్పూన్ తేనెలో సగం టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై సమస్య ఉన్న ప్రాంతంలో రాసి 10 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల ఫలితం అధికంగా ఉంటుంది.
5. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వారికి ధనియాలు ఎంతో మేలు చేస్తాయి. ధనియాలల్లో యాంటీ ఇన్‌ప్లామేటరీ లక్షణాలు ఉన్నందున ఇవి నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. సగం టీ స్పూన్ ధనియాల పొడిని కొబ్బరి నూనెలో కానీ, షియా బటర్ లో వేసి కానీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న ప్రాంతంలో రాయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ధనియాల నూనెను కూడా నొప్పిని తగ్గించడానికి ఉపయోగించవచ్చు.
6. మహిళలకు నెలసరి సమయంలో ఎదురయ్యే అధిక రక్తస్రావం అనే సమస్యను తగ్గించడంలో కూడా ధనియాలు సహాయపడతాయి. ధనియాల నీటిని తాగడం వల్ల రక్తస్రావం అదుపులో ఉంటుంది. ధనియాలల్లో ఉండే ఐరన్ శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.
7. కంటి సమస్యలను తగ్గించి , కంటి చూపును మెరుగుపరచడంలో కూడా ధనియాలు ఉపయోగపడతాయి. ధనియాలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నందున కంటిలో వచ్చే దురదలను, కళ్లు ఎర్రబడడాన్ని, కంటికి వచ్చే ఇన్‌ఫెక్షన్‌లను తగ్గిస్తాయి.
8. ధనియాలను బాగా నానబెట్టి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ నుండి నీటిని తీసి కంటిలో వేసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. ధనియాలను జ్యూస్ చేసుకొని రోజూ పరగడుపున తాగడం వల్ల అనేక కంటి సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా ధనియాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక సమస్యల నుండి బయటపడవచ్చు.