Fat : ప్రస్తుత తరుణంలో చాలా మంది వేగంగా బరువు పెరుగుతున్నారు. అది చాలా మందికి సమస్యగా మారింది. ఈ క్రమంలోనే పెరుగుతున్న బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అందులో భాగంగానే జిమ్‌కు వెళ్లడం, వ్యాయామం చేయడం చేస్తున్నారు. అయితే దీంతోపాటు జీలకర్రతో తయారు చేసే నీటిని తాగడం వల్ల కూడా అధిక బరువును వేగంగా తగ్గించుకోవచ్చు. దీంతో శరీరంలోని కొవ్వు వేగంగా కరుగుతుంది.
జీలకర్ర నీటిని తయారుచేసే విధానం..
ఒక గ్లాస్ నీటిలో రెండు టీస్పూన్ల జీలకర్రను వేసి బాగా మరిగించాలి. 10 నిమిషాల పాటు మరిగాక ఆ నీటిని దించి వడబోయాలి. ఆ నీటిని గోరు వెచ్చగా ఉండగానే పరగడుపునే తాగేయాలి. ఇలా రోజూ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
1. జీలకర్ర నీరు జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. జీలకర్ర నీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. వికారం, వాంతులు, విరేచనాలు, మార్నింగ్ సిక్‌నెస్, గ్యాస్, మలబద్దకం సమస్యలు తగ్గుతాయి.
2. జీలకర్ర నీటిని రోజూ పరగడుపునే తాగడంవల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకుపోతాయి. శరీరం శుభ్రంగా మారుతుంది. లివర్‌లోని విష పదార్థాలు బయటకు పోయి లివర్ క్లీన్ అవుతుంది. దీంతో వ్యాధులు తగ్గుతాయి.
3. జీలకర్ర నీటిని ఇలా రోజూ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రావు. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది.
4. జీలకర్ర నీటిని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనస్సు హాయిగా ఉంటుంది. నిద్ర బాగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
5. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు రోజూ జీలకర్ర నీటిని పరగడుపునే తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీంతో శరీరంలోని కొవ్వు వేగంగా కరుగుతుంది. బరువు తగ్గుతారు. ఒక నెల రోజుల పాటు ఇలా తాగితే ఎంతో మార్పు వస్తుంది. ఆ తరువాత మీ శరీరంలో వచ్చే తేడాలను మీరే గమనిస్తారు.