Kajal Aggarwal : బిడ్డ ఆరోగ్యం కోసం.. వ్యాయామాలు చేస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. వీడియో వైర‌ల్‌..!

Kajal Aggarwal : అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం గ‌ర్భంతో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే త‌న ఫొటోల‌ను ఈమె ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తోంది. గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు తాను ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల గురించి కాజ‌ల్ అగ‌ర్వాల్ వివ‌రిస్తోంది. ఇటీవ‌లే ఈమెకు సీమంతం కూడా ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇక తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె త‌న ట్రెయిన‌ర్‌తో క‌లిసి వ్యాయామం చేస్తూ కనిపించింది.

Kajal Aggarwal exercises for her baby viral video
Kajal Aggarwal

గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు మ‌హిళ‌లు చిన్న‌పాటి తేలికైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే గ‌ర్భంలో పెరుగుతున్న శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టాక బిడ్డలో ఎలాంటి లోపాలు రాకుండా ఉంటాయి. అలాగే ప్ర‌స‌వం కూడా సుఖంగా తేలిగ్గా అవుతుంది. క‌నుక గ‌ర్భిణీలు తేలిక‌పాటి వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం త‌న ట్రెయిన‌ర్‌తో క‌లిసి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తోంది. వాటికి సంబంధించిన ఓ వీడియోను ఆమె షేర్ చేసింది. దీంతో ఆ వీడియో వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియోను కాజ‌ల్ అగ‌ర్వాల్ పోస్ట్ చేయ‌డంతోపాటు దాని కింద కొన్ని కామెంట్స్‌ను కూడా ఉంచింది. తాను చాలా యాక్టివ్‌గా ఉండే వ్య‌క్తిన‌ని, గ‌ర్భంతో ఉన్న స‌మ‌యంలో వ్యాయామం చేయ‌డం వ‌ల్ల శిశువుకు, త‌న‌కు ఎంతో మంచిద‌ని తెలియ‌జేసింది. చిన్న‌పాటి వ్యాయామాల‌తో తాను ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాన‌ని స్ప‌ష్టం చేసింది. కాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ చిరంజీవితో క‌లిసి ఆచార్య అనే మూవీలో న‌టించింది. ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

Editor

Recent Posts