హెల్త్ టిప్స్

Drinking Water : నీటిని రోజూ స‌రిగ్గా తాగితే.. ఇన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా..?

Drinking Water : నీరు తాగకుండా ఎవరైనా ఉండగలరా..? ఎవరూ ఉండలేరు. మనకు నిత్యం కావల్సిన ప్రాథమిక అవసరాల్లో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. కొంత మంది నీటిని అదే పనిగా తాగుతూ కనిపిస్తారు. మరికొందరు నీటిని చాలా తక్కువగా తాగుతారు. అయితే శరీర తత్వాన్ని బట్టి నీటిని రోజూ తగినంత మోతాదులో తీసుకుంటే కింద పేర్కొన్న పలు వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మానవ శరీరంలో దాదాపు 60 శాతం వరకు నీరే ఉంటుంది. ప్రధానంగా మెదడు, గుండెలో 73 శాతం, ఊపిరితిత్తుల్లో 83 శాతం వరకు నీరే ఉంటుంది. ఇవే కాదు శరీరంలోని అనేక అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే నీరు తగినంతగా కావల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నీటిని అధికంగా తాగితే కేవలం 2 రోజుల్లోనే మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు.

వేళ తప్పి భోజనం చేయడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, పరిమితికి మించి భోజనం తీసుకోవడం.. ఇలా కారణాలు ఏమున్నా కడుపులో గ్యాస్ సమస్య ఒక్కోసారి బాధిస్తుంటుంది. అయితే నీటిని తగినంతగా తీసుకుంటే ఈ సమస్యను కూడా 2 రోజుల్లోనే దూరం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా నేడు అధిక శాతం మంది బాధపడుతున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. ఇందులో టైప్ 1, 2 అని రెండు రకాలు ఉన్నాయి. రోజూ నీటిని తగినంతగా తాగితే వారం రోజుల్లో డయాబెటిస్ కంట్రోల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

drink water in right way for many health benefits

ప్రస్తుతం హైబీపీ సమస్య కూడా ఎక్కువగానే ఉంది. దీని వల్ల అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక నెల రోజుల పాటు నీరు అధికంగా తాగితే హైబీపీ సమస్య ఇక బాధించదు. బ్లడ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్.. ఇలా క్యాన్సర్‌లలో అనేక రకాలు ఉన్నాయి. తగినంత నీటిని ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే క్యాన్సర్‌లను నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తులకు సంభవించే క్షయ వంటి వ్యాధులు తగ్గుముఖం పట్టాలంటే 3 నెలల పాటు నీటిని రోజూ త‌గినంత మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం అనారోగ్య సమస్యలున్న వారే కాదు, ఆరోగ్యవంతులు కూడా నీటిని తగినంతగా తీసుకుంటే ఎన్నో ఆశ్చర్యకర ఫలితాలు కనిపిస్తాయి.

Admin

Recent Posts