వినోదం

Krithi Shetty : కృతిశెట్టి ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా.. బేబమ్మ‌ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు..!

Krithi Shetty : అందాల భామ కృతి శెట్టి.. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఉప్పెన సినిమాతో ఓ ఉప్పెనలా వచ్చి టాలీవుడ్ ను షేక్ చేసింది. తన అందచందాలతో మూవీ లవర్స్ ని ముంచెత్తింది. అమ్మడు అదృష్టమో లేక టాలెంటో తెలియదు కానీ, వరుసగా 3 బ్లాక్ బస్టర్ హిట్లతో హాట్రిక్ హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సీన్ కట్ చేస్తే.. మిగిలిన 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో బేబమ్మ‌ కొంచెం అప్ సెట్ అయిందనే చెప్పాలి. కాగా ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ముఖ్యంగా నెటిజన్లు కృతి శెట్టి ఆస్తులు, బ్యాగ్రౌండ్ గురించి సెర్చ్ చేస్తున్నారు. కృతి శెట్టి ఫ్యామిలీ ముందు నుంచి ధనిక కుటుంబమే. కృతి శెట్టి 2003లో కృష్ణ శెట్టి, నీతి శెట్టి దంపతులకు మంగుళూరులో జన్మించింది. అనంతరం వ్యాపారాల కోసం వీరి ఫ్యామిలీ ముంబైకి మారింది. ప్రస్తుతం వీరి ఫ్యామిలీ ముంబైతో పాటు, బెంగుళూరులో కూడా వ్యాపారాలు చేస్తున్నారు. ఆమె తల్లి ఫ్యాషన్ డిజైనర్. దీనితో తన కూతురిని నటిని చేయాలని నిర్ణయించుకుంది. అందుకే మోడలింగ్ లో చేర్పించి యాడ్స్ కూడా చేయించింది. అలా మోడలింగ్ చేస్తున్న సమయంలో కృతిశెట్టికి ఉప్పెన మూవీలో అవకాశం వచ్చింది.

Krithi Shetty net worth assets and properties value

ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో కృతి క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ప్రస్తుతం కృతిశెట్టి ఒక చిత్రానికి దాదాపు రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఆమె మొదటి సినిమాకే రూ.1 కోటి తీసుకొని సంచలన రికార్డు క్రియేట్ చేసింది. కృతిశెట్టికి రూ.42 లక్షల విలువైన ఆడి ఏ4, రూ.31 లక్షల విలువైన టొయోట ఫార్చూన‌ర్‌, రూ.17 లక్షల విలువైన హుండాయ్ కార్లు ఉన్నాయి. అలాగే ముంబై, బెంగుళూరులో సొంత ఇళ్ళు ఉన్నాయి. ఓవరాల్ గా కృతి ఆస్తుల విలువ రూ.30 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందట. వరుస పరాజయాల నుంచి కృతి కోలుకుంటే మాత్రం రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. కృతికి ఇంకో హిట్ ఎప్పుడు పడుతుందో చూడాలి.

Admin

Recent Posts